SI Jobs: మొత్తం 2475 పోలీస్ ఉద్యోగాలు... స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన

Sub-Inspector in Delhi Police, CAPFs Examination, 2019 | ఇప్పుడు 2019 ఎగ్జామినేషన్‌లో 2475 పోస్టుల్ని ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఇంకా పరీక్షలు జరగలేదు. త్వరలో పరీక్షల్ని నిర్వహించనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.

news18-telugu
Updated: December 10, 2019, 10:16 AM IST
SI Jobs: మొత్తం 2475 పోలీస్ ఉద్యోగాలు... స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన
SI Jobs: మొత్తం 2475 పోలీస్ ఉద్యోగాలు... స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రెండు నెలల క్రితం స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 'సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ 2019' నోటిఫికేషన్‌లో మొత్తం 2475 ఎస్సై పోస్టుల్ని ప్రకటించింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ), ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్- మేల్ / ఫీమేల్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల భర్తీకి అక్టోబర్ 16 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇప్పుడు ఆ నోటిఫికేషన్‌లో కేవలం ఎస్సై పోస్టుల్ని మాత్రమే ఖరారు చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సాధారణంగా ముందుగా నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ తర్వాత ఖాళీలను ప్రకటిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే 'ఢిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, సీఐఎస్ఎఫ్‌లో ఏఎస్ఐ ఎగ్జామినేషన్ 2018' నోటిఫికేషన్‌‌లో 1,578 ఎస్ఐ పోస్టుల్ని ప్రకటించింది. ఆ తర్వాత 2019 ఎగ్జామినేషన్‌లో 2475 పోస్టుల్ని ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఇంకా పరీక్షలు జరగలేదు. త్వరలో పరీక్షల్ని నిర్వహించనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.

Sub-Inspector in Delhi Police, CAPFs Examination, 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 2475

సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఢిల్లీ పోలీస్- 211
సీఆర్‌పీఎఫ్- 1072
బీఎస్ఎఫ్- 611


ఐటీబీపీ- 61సీఐఎస్ఎఫ్- 692
ఎస్ఎస్‌బీ- 98

https://ssc.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి Candidates Corner సెక్షన్‌లో Tentative Vacancy ట్యాబ్‌ క్లిక్ చేసి ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. ఖాళీలను ప్రకటిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదిరిపోయిన నోకియా 2.3 ఫీచర్స్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: వచ్చే నెలలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ... ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 64 జాబ్స్... నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>