Home /News /jobs /

STUDY SAYS ZOOM FATIGUE IS AFFECTING MORE WOMEN THAN MEN HERE FULL DETAILS NS GH

Zoom fatigue: వీడియో కాల్స్, మీటింగ్ లతో తీవ్రంగా అలసిపోతున్న మహిళా ఉద్యోగులు.. తాజా అధ్యాయనంలో షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Work From Home నేపథ్యంలో ఆన్లైన్ లో నిరంతరంగా కొనసాగే వీడియో మీటింగుల వల్ల ఉద్యోగులు త్వరగా అలసిపోతున్నారు. దీన్ని జూమ్ ఫ్యాటిగ్ (Zoom fatigue) లేదా జూమ్ అలసట అని పిలుస్తున్నారు. ఇది కొత్త రకం సమస్యలకు దారి తీస్తోందని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఇంకా చదవండి ...
కరోనా కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాల్సి వస్తోంది. దీంతో వీడియో మీటింగులు లేదా వీడియో కాన్ఫరెన్సులు రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మారాయి. కొన్నిసార్లు నిరంతరంగా కొనసాగే వీడియో మీటింగుల వల్ల ఉద్యోగులు త్వరగా అలసిపోతున్నారు. దీన్ని జూమ్ ఫ్యాటిగ్ (Zoom fatigue) లేదా జూమ్ అలసట అని పిలుస్తున్నారు. ఇది కొత్త రకం సమస్యలకు దారి తీస్తోందని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మగవాళ్లతో పోలిస్తే మహిళలు తీవ్రమైన జూమ్ అలసట బారిన పడుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. ప్రతి ఏడుగురు మహిళా ఉద్యోగుల్లో ఒకరు (13.8 శాతం) జూమ్ కాల్స్ తరువాత ఎక్కువగా అలసిపోతున్నట్టు పరిశోధకులు తేల్చారు. మగవాళ్లలో ఇది కేవలం 5.5 శాతంగా ఉంది. ప్రతి 20 మంది పురుషుల్లో ఒకరు జూమ్ కాల్స్ వల్ల అలసిపోతున్నామని చెప్పారు.




 వీడియో కాన్ఫరెన్సులు జరిగేటప్పుడు తమపై ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవడమే (self focused attention) ఇందుకు కారణమని సోషల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇదే మహిళల్లో అలసట భావనకు కారణమవుతోంది. ఒక వీడియో మీటింగ్‌లో తాము ఎలా పాల్గొంటున్నాం, ఎలా కనిపిస్తున్నామనే అంశంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడాన్ని సెల్ఫ్ ఫోకస్డ్ అటెన్షన్ అంటున్నారు. సాధారణంగా అందరికీ ఒకే సంఖ్యలో వీడియో మీటింగ్స్ జరుగుతున్నా, మహిళలు మీటింగ్‌లో పాల్గొనే సమయం ఎక్కువగా ఉంటోందని అధ్యయనంలో కనుగొన్నారు. మీటింగ్స్ మధ్యలో మహిళలు బ్రేక్ తీసుకోవట్లేదని గుర్తించారు. అందువల్ల వారు ఎక్కువగా అలసిపోతున్నారు.

వారిపై ఒత్తిడి
వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ తరువాత ప్రజలు ఎందుకు అలసిపోయినట్లు భావిస్తారనే అంశంపై ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయనాన్ని టెక్నాలజీ, మైండ్ అండ్ బిహేవియర్ అనే జర్నల్‌లో ప్రచురించారు. సుమారు 10,322 మందిపై ఈ సర్వే చేశారు. ఈ ఫిబ్రవరి, మార్చి నెలల్లో వీరు వీడియో మీటింగుల్లో పాల్గొన్న తరువాత పరిస్థితులను పరిశోధకులు అంచనా వేశారు. అలసట ప్రభావాన్ని వివిధ పద్ధతుల్లో గణించారు. దీని ద్వారా మహిళలు వీడియో మీటింగుల తరువాత ఎక్కువగా అలసిపోతున్నట్టు గుర్తించారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఇతర అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.

సమస్యకు పరిష్కారం లేదా?
ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. డిఫాల్ట్ డిస్‌ప్లే సెట్టింగ్‌లను మార్చడం, సెల్ఫ్ వ్యూ ఆప్షన్‌ను ఆపేయడం ద్వారా కెమెరాపై దృష్టి కేంద్రీకరించకుండా జాగ్రత్తపడవచ్చు. స్క్రీన్ నుంచి ఎక్కువ దూరంలో కూర్చోవడం, మీటింగ్స్ జరిగేటప్పుడు వీడియోను ఆపేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: JioMeet, Online classes, Work From Home, Zoom App

తదుపరి వార్తలు