హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Study Abroad: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా..? విభిన్న ప్రత్యేకతలున్న ఈ దేశాలపై ఓ లుక్కేయండి..

Study Abroad: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా..? విభిన్న ప్రత్యేకతలున్న ఈ దేశాలపై ఓ లుక్కేయండి..

Study Abroad: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా..? విభిన్న ప్రత్యేకతలున్న ఈ దేశాలపై ఓ లుక్కేయండి..

Study Abroad: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా..? విభిన్న ప్రత్యేకతలున్న ఈ దేశాలపై ఓ లుక్కేయండి..

డిగ్రీ(Degree) పూర్తి చేసిన విద్యార్థులు(Students) తదుపరి విద్య కోసం విదేశాలకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. దీని కోసం విద్యార్థులు అనేక రకాల పరీక్షలకు(Exams) హాజరవుతారు. విదేశాల్లో విద్యను అనుసరించేందుకు ఆయా ఎంట్రెన్స్ పరీక్షల్లో (Entrance Exams) అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

డిగ్రీ(Degree) పూర్తి చేసిన విద్యార్థులు(Students) తదుపరి విద్య కోసం విదేశాలకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. దీని కోసం విద్యార్థులు అనేక రకాల పరీక్షలకు(Exams) హాజరవుతారు. విదేశాల్లో విద్యను అనుసరించేందుకు ఆయా ఎంట్రెన్స్ పరీక్షల్లో (Entrance Exams) అర్హత సాధించాల్సి ఉంటుంది. దీని కోసం కోచింగ్ లు తీసుకొని మరీ పరీక్షకు హాజరవుతుంటారు. ఇలా అర్హత సాధించిన వారు విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇలా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం కొన్ని దేశాల్లోని వింత చట్టాలు ఉండటమే. ఈ చట్టాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగాలకు అవకాశాలు కల్పించే దేశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. అంతే కాకుండా.. విద్య పూర్తి చేసిన తర్వాత ఇక్కడే కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని(Package) పొందవచ్చు. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముందుగా చెప్పుకునే దేశం ఐర్లాండ్.

ఐర్లాండ్.

ఐర్లాండ్‌లో ఉన్నత స్థాయి విద్య అందుబాటులో ఉంది. కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది విద్యార్థులు విద్య కోసం ఇక్కడకు వెళుతుంటారు. ఈ దేశానికి వీసా పొందడం భారతీయ విద్యార్థులకు సులభమైన విషయం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత ఈ దేశ వీసా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ విద్య పూర్తి చేసిన తర్వాత ఉపాధి అవకాశాలను కూడా పొందొచ్చు.

WIPRO: విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జీతాల పెంపు.. ఎంత శాతం పెరుగుతాయంటే..

న్యూజిలాండ్‌..

న్యూజిలాండ్‌లో చదువుకోవడానికి విద్యార్థి వీసా అవసరం లేదు. అలాగే ఈ దేశంలో విద్యాభ్యాసానికి వెళ్లాలన్న నిబంధనలు అమెరికాలో ఉన్నంత కఠినంగా లేవు. అందువల్ల దేశంలో వందలాది మంది విద్యార్థులు విద్య కోసం వెళుతున్నారు.

కెనడా..

కెనడా ప్రపంచ విద్యార్థులకు విద్యాబండాగారంగా చెప్పుకొవచ్చు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది విద్యార్థులు విద్య కోసం కెనడాకు వస్తారు. భారతదేశం నుండి చాలా మంది విద్యార్థులు కెనడాకు వెళతారు. ఎందుకంటే విద్య ఖర్చు మరియు జీవన పరిస్థితులు ఇక్కడి విద్యార్థులను ఆకర్షిస్తాయి. విశేషమేమిటంటే చదువు కోసం కెనడా వెళ్లినప్పుడు (స్టడీ ఇన్ కెనడా) వీసా వెంటనే అందుబాటులోకి వస్తుంది.

Jobs In IRCTC: IRCTCలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు .. ఆకర్షణీయమైన జీతం..

జర్మనీ..

జర్మనీలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు విద్యకు ఎటువంటి ఫీజు వసూలు చేయవు. కాబట్టి ఈ దేశానికి వచ్చే విద్యార్థుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తోంది. విద్యార్థులకు లివింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే, విద్య కోసం ఈ దేశానికి రావడానికి వీసా వెంటనే అందుబాటులో ఉంటుంది. అందువల్ల జర్మనీ విద్యకు అత్యుత్తమ దేశంగా పరిగణించబడుతుంది.

పైన చెప్పిన దేశాల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లల్లో ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Study abroad

ఉత్తమ కథలు