తమ కళాశాలలో చదివే విద్యార్థినులు కాలేజీ ఆవరణలో సెల్ఫీలు కూడా దిగకూడదని నిబంధన విధించింది. అమ్మాయిలు జడ(braid) వేసుకునే కాలేజీకి రావాలని లూజ్ హెయిర్‌తో వస్తే కళాశాలలోకి అనుమతించబోమని ఓ కాలేజీ ప్రిన్సిపల్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
బిహార్(Bihar) రాజధాని పట్నాలో మగధ్ కళాశాల యాజమాన్యం .. ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు గతంలో ఒక చిత్రమైన ఆదేశం జారీ చేసింది. జీన్స్ ప్యాంటులు, పటియాలా సూట్స్ లేదా జీన్స్ కోటులు ధరించి క్యాంపస్‌లోకి అడుగుపెట్టవద్దని .. అలాగే మొబైల్ ఫోన్లు కూడా కాలేజీలోకి అనుమతించేది లేదని ఆదేశాలు జారీచేసింది. అయితే వారు ఎలాంటి దుస్తులు ధరించాలో .. ఎలాంటి దుస్తులు ధరించకూడదో కాలేజీ నిర్ణయించడమేమిటని విద్యార్థులు ప్రశ్నించడంతో ఈ వార్త అప్పట్లో జాతీయ మీడియా దృష్టిలో పడింది. ఇపుడు మరోసారి అదే బిహార్‌లోని సుందరవతి (sunderwati) మహిళా కళాశాల నిబంధనలు చర్చనీయాంశమయ్యాయి. తమ కాలేజీలో చదివే విద్యార్థినులకు వినూత్న నిబంధనలు విధించింది. ఈ కొత్త నిబంధనల కింద విద్యార్థినులు జడ(inert) వేసుకునే కాలేజీకి రావాలి. అంతేకాదు డ్రెస్ కోడ్(dress code) కూడా విధించింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి వేరే డ్రెస్సులు(dresses) ధరించి వస్తే వారిని కళాశాల ఆవరణలోని అనుమతించబోమని ప్రకటించింది.
సెల్ఫీలు బంద్..
సుందరవతి(sunderwati) మహిళా కళాశాల. బిహార్‌లోని భాగల్పూర్(Bhagalpur)లో మంచి పేరున్న కాలేజీ ఇది ! ఈ కాలేజీలో ఆర్ట్స్, సైన్స్ తదితర గ్రూపుల నుంచి దాదా 1,500 మంది విద్యార్థినులు ఉన్నారు. దీంతో వారంతా కాలేజీకి ఏ రకమైన డ్రెస్‌లో రావాలి అనే దానిపై కళాశాల ఓ కమిటీ ఏర్పాటుచేసింది. కమిటీ సూచించిన దుస్తులనే వాడాలని కాలేజీ యాజమాన్యం విద్యార్థినులకు స్పష్టంచేసింది. అంతేకాదు ఇకపై తమ కళాశాలలో చదివే విద్యార్థినులు కాలేజీ ఆవరణలో సెల్ఫీ(selfie)లు కూడా దిగకూడదని నిబంధన విధించింది. అమ్మాయిలు జడ(braid) వేసుకునే కాలేజీకి రావాలని లూజ్ హెయిర్(loose hair)తో వస్తే కళాశాలలోకి అనుమతించబోమని(no entry) కాలేజీ ప్రిన్సిపల్ రామన్ సిన్హా ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఈ కొత్త నిబంధనలపై చాలామంది విద్యార్థినులు(students) అసహనం వ్యక్తంచేస్తున్నారు. మొదట స్టడీస్ లో తమ ప్రతిభ, వికాసం వంటివాటిని పరిగణన లోకి తీసుకోవాలి తప్ప ఈ విధమైన కఠిన నిబంధనలు పెట్టడమేంటని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు.
కాగా-కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు డ్రెస్ కోడ్ అమలు చేయడమన్నది వివక్ష చూపేదిగా ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ గతంలోనే జారీ చేసిన రెండు వెర్వేరు నోటిఫికేషన్లలో పేర్కొన్నాయి. విద్యార్థులకు ఇలా వేర్వేరు రూల్స్ విధించడంలోని ఔచిత్యాన్ని ఈ సంస్థలు ప్రశ్నిచాయి. డ్రెస్ కోడ్ అన్నది విద్యార్థుల స్వేచ్ఛను హరించేదిగా ఉండరాదని ఇవి సూచించాయి. అసభ్యంగా ఉండనంతవరకు వారు ఏ విధమైన డ్రెస్ అయినా ధరించాలన్నది ఈ సంస్థల వాదన.. సెక్సువల్ హరాస్మెంట్ కు చెక్ పెట్టేందుకు ఇలాంటి నిబంధన విధిస్తున్నామని కొన్ని విద్యాసంస్థలు చెబుతున్నప్పటికీ. ఇది వివక్షా పూరితమేనని విద్యార్థినుల తలిదండ్రులు కూడా అభిప్రాయపడుతున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.