హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2023: జేఈఈ మెయిన్ సెషన్-1 వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్.. సోషల్ మీడియాలో డిమాండ్ల వెల్లువ

JEE Main 2023: జేఈఈ మెయిన్ సెషన్-1 వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్.. సోషల్ మీడియాలో డిమాండ్ల వెల్లువ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2023, సెషన్-1కు సంబంధించి ఆందోళన నెలకొంది. సీబీఎస్‌ఈ బోర్డ్ పరీక్షలు పూర్తయిన తరువాత జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA)కి విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియాలో ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ చదవడానికి ఆసక్తి చూపుతారు. జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ JEE Mainకి ఎక్కువ మంది ప్రిపేర్‌ అవుతుంటారు. ఈ పరీక్షకి పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2023 (JEE Main 2023), సెషన్-1కు సంబంధించి ఆందోళన నెలకొంది. సీబీఎస్‌ఈ బోర్డ్ పరీక్షలు పూర్తయిన తరువాత జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA)కి విజ్ఞప్తి చేస్తున్నారు.

#JEEAfterBoards హ్యాష్‌ట్యాగ్‌‌ వైరల్

జేఈఈ మెయిన్ కోసం ప్రిపేర్ కావడానికి తక్కువ సమయం ఉందని, పరీక్ష వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు #JEEAfterBoards అనే హ్యాష్‌ట్యాగ్‌‌ను ట్విటర్‌లో వైరల్ చేస్తున్నారు. సీబీఎస్‌ఈ ఇటీవల బోర్డ్ ఎగ్జామ్స్-2023 షెడ్యూల్ ప్రకటించింది. జనవరి 2 నుంచి ప్రాక్టికల్స్ మొదలవుతున్నాయి. పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రెండింటి మధ్య జేఈఈ మెయిన్ పరీక్షను విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. దీంతో ఎగ్జామ్‌ వాయిదా వేయాలని ట్విట్టర్ వేదికగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Career wise: డ్రాయింగ్ ఇష్టమా? అయితే.. ఈ కోర్సు మీకు బెస్ట్‌ కెరీర్‌ ఆప్షన్‌ కావొచ్చు? కంప్లీట్ కెరీర్‌ గైడెన్స్‌ ఇదే..

ఏప్రిల్‌కు వాయిదా వేయాలి

మరోపక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కూడా జేఈఈ-2023 షెడ్యూల్ ప్రకటించింది. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24 నుంచి ప్రారంభమై, జనవరి 31న ముగియనున్నాయి. ఇదే సమయంలో సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. దీంతో జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను ఏప్రిల్‌కు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

అభ్యర్థుల స్పందన ఇలా

జేఈఈ మెయిన్ వాయిదా విషయంలో అభ్యర్థులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఒక అభ్యర్థి తాను చేసిన పోస్ట్‌లో.. ‘సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షల సమయంలో బోర్డ్ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తుంటాయి. ఈ రెండు ముఖ్యమైన పరీక్షలకు విద్యార్థులు ఒకేసారి ఎలా చదువుకోవాలి? కొన్ని పాఠశాలలు రాబోయే వారాల్లో తమ ప్రీబోర్డ్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. దయచేసి కనీసం విద్యార్థుల కోసమైనా ఆలోచించండి.’ అంటూ కోరారు.

మరో అభ్యర్థి NTAను ఉద్దేశించి చేసిన ట్వీట్‌లో.. ‘మీరు జనవరిలో పరీక్ష నిర్వహించాలని అనుకుంటే, సెప్టెంబర్‌లోనే మాకు ఎందుకు తెలియజేయలేదు? ఎందుకు ఆలస్యం చేశారు. ఇది ఆకస్మిక, ప్రణాళిక లేని నిర్ణయం. విద్యార్థుల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా నార్మలైజ్ కోసం, మా జీవితాలను నాశనం చేస్తున్నారు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బాంబే హైకోర్ట్‌లో పిటిషన్

జేఈఈ మెయిన్ సెషన్‌-1 వాయిదా వేయాలని అభ్యర్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. JEE మెయిన్ 2023కి అర్హత సాధించడానికి 75 శాతం ప్రమాణాన్ని కూడా ఈ పిటిషన్ సవాలు చేసింది. జేఈఈ మెయిన్ జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్‌ల్లో నిర్వహించనున్నారు. రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 మధ్య జరగనుంది.

First published:

Tags: Career and Courses, Exams, JEE Main 2023, JOBS, National Testing Agency

ఉత్తమ కథలు