Home /News /jobs /

STUDENTS SHOULD FOLLOW THESE STUDY TIPS TO GET GOOD RESULTS IN COMPETITIVE EXAMS NS

Exam Tips: పరీక్షలంటే టెన్షనా? అయితే, ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్స్.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివిధ ఎంట్రెన్స్, బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో విద్యార్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. అయితే ఈ టిప్స్ పాటిస్తే స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారేమంటున్నారంటే..

    కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువులు గందరగోళంగా సాగాయి. ఆయా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా.. అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయన్నది అంతు చిక్కని ప్రశ్నే. ఇంటర్ నెట్ సమస్యతో పాటు వివిధ కారణాలతో అనేక మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారు. పేద, మధ్య తగరతి విద్యార్థులు అయితే ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు ఇళ్లల్లో సరైన సదుపాయాలు లేక పోవడంతో వారి చదువులు అరకొరగా సాగాయి. అయితే.. ఆలస్యంగా అనేక ప్రభుత్వాలు విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాసులను ప్రారంభించాయి. అయితే ఎలాగైనా ఈ సారి బోర్డు పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే సరిగా ప్రతిభ చూపుతామా లేదా అన్న సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. అయితే నిపుణులు మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. వారు ఏమంటున్నారంటే..

    టైం టేబుల్..
    పరీక్షలను అనగానే విద్యార్థులకు గుర్తొచ్చేది సిలబస్. కొండంత సిలబస్ చూసి విద్యార్థులు టెన్షన్ పడుతుంటారు. అయితే టైం టేబుల్ రూపొందించుకుని చదివితే ఆ సిలబస్ ను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టైం టేబుల్ లేకుండా చదివితే ఎంత సిలబస్ పూర్తయింది?, ఇంకెంత మిగిలింది? అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన తప్పుతుంది. దీంతో పరీక్షల నాటికి టెన్షన్ పడాల్సి వస్తుంది. టైం టేబుల్ లో మొదటగా ముఖ్యమైన అంశాలను చేర్చుకోవడం మేలు.
    Students: విద్యార్థులకు గుడ్ న్యూస్..వాటికి దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే ప్రతి నెలా రూ. 1 లక్ష స్టైఫండ్..​

    మాక్ ఎగ్జామ్స్..
    ఎన్ని గంటలు చదివాం? ఎంత సిలబస్ చదివాం? అన్న అంశాల కంటే పరీక్షల్లో ఎంత మేరకు రాశాం? అన్నది ముఖ్యమైన అంశం. దాని ఆధారంగానే విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. అయితే బోర్డు పరీక్షలకు ముందే విద్యార్థులు మోడల్ పరీక్షలు రాస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాత పేపర్లు, ఇతర మోడల్ పేపర్లతో విద్యార్థులు మాక్ టెస్టులు రాస్తే ఏ అంశాల నుంచి ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి?, ఏ అంశాల్లో వీక్ గా ఉన్నాం? అన్న అంశాలపై స్పష్టత వస్తుంది.

    ముఖ్యమైన అంశాలను గుర్తించడం..
    చాలా మంది విద్యార్థులు ప్రిపరేషన్ అనగానే మొదటి చాప్టర్ నుంచి ప్రారంభించి వరుసగా ఆఖరి చాప్టర్ వరకు చదవడం అని భావిస్తారు. అయితే తక్కువ సమయం ఉన్నప్పుడు అలా చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన, తరచుగా ప్రశ్నలు అడిగే పాఠ్యాంశాలను గుర్తించి వాటిని ముందుగా చదువుకోవడం మంచిది.

    ఒత్తిడికి గురి కావొద్దు..
    ఒత్తిడి లేని మనస్సు విజయానికి ప్రవేశ ద్వారమని నిపుణులు చెబుతుంటారు. అయితే విద్యార్థులు ప్రిపరేషన్ తో పాటు ఒత్తిడి తగ్గించుకోడం కోసం కొంత సమయాన్ని వినోద కార్యకలాపాలకు కేటాయించుకోవడం మంచిది. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

    పాజిటీవ్ గా ఉండడం..
    ఇంత సిలబస్ పూర్తి చేస్తామా?, లేదా? పాస్ అవుతామా?, లేదా? అన్న సందేహాలతో ప్రిపేర్ అవ్వడం అంత మంచిది కాదు. పాజిటీవ్ ఆలోచనతో ప్రిపేర్ అయితే ఉత్తమ ఫలితాలను సాధిస్తామని నిపుణులు చెబుతున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Exam Tips, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు