హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Exam Tips: పరీక్షలంటే భయ పడుతున్నారా? అయితే.. ఈ టిప్స్ పాటించి ఉత్తమ ఫలితాలు పొందండి.. వివరాలివే

Exam Tips: పరీక్షలంటే భయ పడుతున్నారా? అయితే.. ఈ టిప్స్ పాటించి ఉత్తమ ఫలితాలు పొందండి.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో అనేక మంది విద్యార్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. అయితే.. విద్యార్థులు ఈ చిట్కాలు పాటిస్తే విద్యార్థులు మంచి రిజల్ట్స్ సాధించవచ్చు.

కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా సాగింది. ఆయా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా.. అవి విద్యార్థులకు ఎంత వరకు అర్థమయ్యాయన్నది అంతు చిక్కని ప్రశ్నే. పేద, మధ్య తగరతి విద్యార్థులు అయితే ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు ఇళ్లల్లో సరైన సదుపాయాలు లేక పోవడంతో వారి చదువులు అరకొరగా సాగాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో పలు ప్రవేశ, కాంపిటేటీవ్ పరీక్షల నిర్వహణకు టైం టేబుళ్లను అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకుని చదివితే ఆయా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

టైం టేబుల్ తయారీ..

పరీక్షలను అనగానే విద్యార్థులకు గుర్తొచ్చేది సిలబస్. కొండంత సిలబస్ చూసి విద్యార్థులు టెన్షన్ పడుతుంటారు. అయితే టైం టేబుల్ రూపొందించుకుని చదివితే ఆ సిలబస్ ను అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టైం టేబుల్ లేకుండా చదివితే ఎంత సిలబస్ పూర్తయింది?, ఇంకెంత మిగిలింది? అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన తప్పుతుంది. దీంతో పరీక్షల నాటికి టెన్షన్ పడాల్సి వస్తుంది. టైం టేబుల్ లో మొదటగా ముఖ్యమైన అంశాలను చేర్చుకోవడం మేలు.

మాక్ ఎగ్జామ్స్..

ఎన్ని గంటలు చదివాం? ఎంత సిలబస్ చదివాం? అన్న అంశాల కంటే పరీక్షల్లో ఎంత మేరకు రాశాం? అన్నది ముఖ్యమైన అంశం. దాని ఆధారంగానే విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. అయితే బోర్డు పరీక్షలకు ముందే విద్యార్థులు మోడల్ పరీక్షలు రాస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాత పేపర్లు, ఇతర మోడల్ పేపర్లతో విద్యార్థులు మాక్ టెస్టులు రాస్తే ఏ అంశాల నుంచి ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి?, ఏ అంశాల్లో వీక్ గా ఉన్నాం? అన్న అంశాలపై స్పష్టత వస్తుంది.

ముఖ్యమైన అంశాలను గుర్తించడం..

చాలా మంది విద్యార్థులు ప్రిపరేషన్ అనగానే మొదటి చాప్టర్ నుంచి ప్రారంభించి వరుసగా ఆఖరి చాప్టర్ వరకు చదవడం అని భావిస్తారు. అయితే తక్కువ సమయం ఉన్నప్పుడు అలా చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన, తరచుగా ప్రశ్నలు అడిగే పాఠ్యాంశాలను గుర్తించి వాటిని ముందుగా చదువుకోవడం మంచిది.

ఒత్తిడికి గురి కావొద్దు..

ఒత్తిడి లేని మనస్సు విజయానికి ప్రవేశ ద్వారమని నిపుణులు చెబుతుంటారు. అయితే విద్యార్థులు ప్రిపరేషన్ తో పాటు ఒత్తిడి తగ్గించుకోడం కోసం కొంత సమయాన్ని వినోద కార్యకలాపాలకు కేటాయించుకోవడం మంచిది. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

పాజిటీవ్ గా ఉండడం..

ఇంత సిలబస్ పూర్తి చేస్తామా?, లేదా? పాస్ అవుతామా?, లేదా? అన్న సందేహాలతో ప్రిపేర్ అవ్వడం అంత మంచిది కాదు. పాజిటీవ్ ఆలోచనతో ప్రిపేర్ అయితే ఉత్తమ ఫలితాలను సాధిస్తామని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: EDUCATION, Exam Tips, Exams

ఉత్తమ కథలు