హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advanced: టాప్ ఐఐటీల్లో అడ్మిషన్ కోసం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌కు ఇలా ప్రిపేర్ అవ్వండి..!

JEE Advanced: టాప్ ఐఐటీల్లో అడ్మిషన్ కోసం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌కు ఇలా ప్రిపేర్ అవ్వండి..!

JEE Advanced

JEE Advanced

JEE Advanced: త్వరలో జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో, అభ్యర్థుల కోసం కొన్ని సూచనలతో పాటు తన సొంత అనుభవాలను పంచుకున్నారు జేఈఈ ర్యాంకర్, ఇన్‌స్టాప్రెప్ బై 7క్లాసెస్ (Instaprep by 7Classes) ఫౌండర్ అనూప్‌ రాజ్. ఆయన చెప్పిన టిప్స్ ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) జాతీయ స్థాయి ఐఐటీ (IIT)ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే టాప్ ఐఐటీ (Top IITs)ల్లో అడ్మిషన్ పొందవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి స్కోర్ చేయాలంటే సిలబస్ (Syllabus), ఎగ్జామ్ ప్యాట్రన్‌ (Exam Pattern)పై పూర్తి అవగాహన ఉండాలి. త్వరలో జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో, అభ్యర్థుల కోసం కొన్ని సూచనలతో పాటు తన సొంత అనుభవాలను పంచుకున్నారు జేఈఈ ర్యాంకర్, ఇన్‌స్టాప్రెప్ బై 7క్లాసెస్ (Instaprep by 7Classes) ఫౌండర్ అనూప్‌ రాజ్. ఆయన చెప్పిన టిప్స్ ఏవో చూద్దాం.

అనూప్ 2010లో జేఈఈకి హాజరయ్యారు. 400 మార్కులకు 237 స్కోర్ చేసి, 997వ ర్యాంక్ సాధించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి (IIT bombai)లో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరారు.

ప్రిపరేషన్ టిప్స్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నేను బీహార్‌లోని గయాలో ఉన్నప్పుడు, నా స్నేహితుల ద్వారా ఇంజనీరింగ్ గురించి తెలుసుకున్నాను. జేఈఈ కోచింగ్ సెంటర్ సూపర్ 30కి ఎంపికయ్యాను. ప్రతిరోజూ 14 నుంచి 15 గంటల పాటు ప్రిపేర్ అయి జేఈఈ ద్వారా ఐఐటీ బొంబాయిలో అడ్మిషన్ సాధించాను.’ అని తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కొన్ని చిట్కాలు చెప్పారు.

‘‘గత 5-10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్‌ను తప్పనిసరిగా అటెమ్ట్ చేస్తే.. ఎగ్జామ్ ప్యాట్రన్‌పై అవగాహన వస్తుంది. ప్రతి సబ్జెక్టుకు తగిన సమయం కేటాయించి, క్రమం తప్పకుండా రివైజ్ చేసేలా చూసుకోవాలి. ప్రిపరేషన్‌తోపాటు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిపరేషన్‌లో ఏకాగ్రత, మెరుగైన పనితీరును కనబరచడానికి తప్పనిసరిగా జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించాలి. ఇందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి.’’ అని అనూప్‌ రాజ్ సూచించారు.

* ఐఐటీ బాంబే‌లో అడ్మిషన్ కోసం..

జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ఐఐటీ బాంబే‌లో అడ్మిషన్ సాధించడం చాలా మంది అభ్యర్థుల కల. ఇందుకు తప్పనిసరిగా వెయ్యి లోపు ర్యాంకు సాధించాలి. ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులపై మంచి కమాండ్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఫిజిక్స్, మ్యాథ్స్‌లతో పోలిస్తే కెమిస్ట్రీ చాలా సులభం. ఇందులో మంచి స్కోర్ కోసం ఎన్సీఈఆర్‌టీ 11, 12వ తరగతి సిలబస్ చదవాలి.

ఫిజిక్స్‌లో కాన్సెప్ట్స్‌పై స్పష్టత ఉంటే, ఎలాంటి ప్రశ్నలైనా పరిష్కరించవచ్చు. ఇందు కోసం హెచ్‌సీ వర్మ పుస్తకాలను అధ్యయనం చేయండి. JEE అడ్వాన్స్‌డ్‌లో గణితాన్ని ఎల్లప్పుడూ కష్టతరమైన సబ్జెక్ట్‌గా పరిగణిస్తారు. దీనిపై పట్టు సాధించాలంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి.’ అని జేఈఈ అడ్వాన్స్‌డ్ అభ్యర్థులకు అనూప్ సూచించారు.

ఇది కూడా చదవండి : ఉద్యోగ వేటలో ఉన్నారా..? ఈవారం అప్లై చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..

ఐఐటీల్లో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న 12వ తరగతి విద్యార్థులు.. రోజువారి ప్రిపరేషన్‌ను ఏడు స్లాట్లుగా విభజించుకోవాలని అనూప్ సూచించారు. బాగా నిద్రపోయే స్లాట్, స్వీయ-సంరక్షణ, పాఠశాల, కోచింగ్, నో స్టడీ ఓన్లీ చిల్ స్లాట్, సెల్ఫ్ స్టడీ, స్కూల్ అండ్ కోచింగ్ కోసం హోంవర్క్.. వంటివన్నీ ఉండాలన్నారు. ‘ఈ ఆర్డర్ స్థిరంగా ఫాలో అవ్వండి. స్వీయ అధ్యయనంలో ఎప్పుడూ రాజీపడకండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలను భిన్నమైన విధానంతో సిద్ధం కావాలి. సాయంత్రం ప్రాక్టీస్, స్వాలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని అనూప్ రాజ్ సూచించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, IIT, Jee, Jee mains 2022, JOBS

ఉత్తమ కథలు