JEE Main Scam: విద్యార్థుల‌కు న్యాయం జ‌ర‌గాలి.. జేఈఈ స్కాంపై రాహుల్‌గాంధీ ట్వీట్‌

రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

జేఈఈ స్కామ్‌పై కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఇంజ‌నీరింగ్(Engineering) ప్ర‌వేశానికి క‌ష్ట‌ప‌డి చ‌దివిన విద్యార్థుల‌(Students)కు న్యాయం జ‌ర‌గాల‌ని పార‌ద‌ర్శ‌క‌మైన ప‌రీక్ష‌ను విద్యార్థులు కోరుకుంటున్నార‌ని ఆయ‌న ట్వీట్(Tweet) చేశారు.

  • Share this:
    హర్యానాలోని సోనేప‌ట్ కేంద్రంలో జరిగిన JEE మెయిన్ స్కామ్‌పై సీబీఐ ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేసింది. ప‌రీక్షా కేంద్రంలో సాంకేతిక ప‌రిక‌రాల‌ను హ్య‌క్ చేసిన‌ట్టు సీబీఐ అధికారులు ప్రాథ‌మికంచ‌నాకు వ‌చ్చారు.  జేఈఈ స్కామ్‌పై కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. ఇంజ‌నీరింగ్(Engineering) ప్ర‌వేశానికి క‌ష్ట‌ప‌డి చ‌దివిన విద్యార్థుల‌(Students)కు న్యాయం జ‌ర‌గాల‌ని పార‌ద‌ర్శ‌క‌మైన ప‌రీక్ష‌ను విద్యార్థులు కోరుకుంటున్నార‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.



    #JEE (మెయిన్) ప‌రీక్ష స‌రిగాజ‌ర‌గ‌లేద‌ని. పోటీప‌రీక్ష‌ల‌కు విద్యార్థులు ఎంతో క‌ష్ట‌ప‌డి, ఇబ్బందులు ప‌డుతూ హాజ‌ర‌వుతారు. వారు కేవ‌లం పార‌ద‌ర్శ‌క‌మైన ప‌రీక్షల‌ను కోర‌కుంటున్నారు. ప్ర‌భుత్వం స‌మ‌స్య‌ను క‌ప్పిపుచ్చుకొంటుంది. అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

    JEE Advance: విదేశాల్లో జేఈఈ ప‌రీక్షా కేంద్రాలు లేవు.. ఇండియా కొచ్చి రాయాల్సిందే


    అస‌లేం జ‌రిగింది..
    ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోస‌మే హ‌ర్యాణాలో సోనేపట్ పరీక్ష కేంద్రం(Exam Center) ఏర్పాటు చేశారు. అక్క‌డి కంప్యూట‌ర్లను వేరే చోట ఉండి నియంత్రించేలా సాంకేతిక‌త‌ను ఏర్పాటు చేశారు. నిందితుల‌ను ఇప్ప‌టికే ప్ర‌శ్నించిన‌ట్టు సీబీఐ తెలిపింది. ఈ స్కామ్‌(Scam)లో ద‌ర్యాప్తులో ప‌లు ఆశ్ఛ‌ర్యక‌ర‌ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ముందుగా విద్యార్థుల‌తో స్కామ్ సూత్రధారులు మాట్లాడుతారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ ప‌రీక్ష రాసేందుకు సోనేప‌ట్ కేంద్రానికి ఎంపిక చేసుకోవాల‌ని సూచిస్తారు. మ‌హారాష్ట్ర విద్యార్థులు సైతం హ‌ర్యాణాలోని సోనేప‌ట్ కేంద్రానికి ఎంపిక చేసుక‌న్న‌ట్టు గుర్తించారు. జేఈఈ పరీక్ష ద‌ర్యాప్తులో భాగంగా ప‌రీక్షా కేంద్రం నిర్వ‌హ‌ణ సిబ్బందిని ప్ర‌శ్నిస్తున్న‌ట్లు సీబీఐ పేర్కొంది. ఈ స్కామ్‌(Scam)లో ప్ర‌తీ అభ్య‌ర్థి నుంచి రూ.12 ల‌క్ష‌ల నుంచి రూ.15ల‌క్ష‌లు అడిగిన‌ట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.
    పలువురి అరెస్టు..
    ఈ కేసులో సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నీ వ్య‌క్తులను విచారిస్తున్నారు. దీనిపై సెప్టెంబ‌ర్ 1న కేసు న‌మోదు చేసిన‌ట్టు సీబీఐ(CBI) తెలిపింది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 20 చోట్ల దాడులు నిర్వ‌హించారు. ఒక ప్రైవేట్ కంపెనీ మరియు దాని డైరెక్టర్లు, ముగ్గురు ఉద్యోగులు మరియు ప్రైవేట్ వ్యక్తులతో సహా ఇతరులపై కేసు నమోదు చేసిన‌ట్టు సీబీఐ తెలిపింది. ఈ ద‌ర్యాప్తులో 25 ల్యాప్‌టాప్‌లు(Laptops), ఏడు కంప్యూట‌ర్‌లు, 30 పోస్టు డేటేట్ చెక్కుల‌ను స్వాధీనం చేసుకొన్న‌ట్టు సీబీఐ(CBI) అధికారులు తెలిపారు. ఈ కేసుపై సీబీఐ అధికారులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published: