హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE: పిల్లలను ఒత్తిడికి గురి చేయవద్దు.. ఏప్రిల్‌ 1 తర్వాతే క్లాసులు: సీబీఎస్‌ఈ

CBSE: పిల్లలను ఒత్తిడికి గురి చేయవద్దు.. ఏప్రిల్‌ 1 తర్వాతే క్లాసులు: సీబీఎస్‌ఈ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అకడమిక్‌ క్యాలెండర్‌ను ఫాలో అవ్వాల్సిందేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) చెప్పింది. ఏప్రిల్ 1 లోపు సెషన్‌ను ప్రారంభించవద్దని సర్క్యులర్ జారీ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

కొన్ని విద్యాసంస్థలు తమ విద్యార్థులకు మంచి మార్కులు, ర్యాంకులు రావాలనే ఉద్దేశంతో వారిని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఏడాదిపాటు బోధించాల్సిన సిలబస్‌ను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసి, ఆ తర్వాత వారితో బట్టీ పట్టిస్తున్నాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులకు జనవరిలోగా సిలబస్‌ పూర్తి చేయడంతో పాటు పరీక్షలు నిర్వహించేస్తున్నాయి. ఆ తర్వాత నుంచి వారికి పదో తరగతి పాఠాలు బోధిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పోటీని తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. దీనిపై సీబీఎస్‌ఈ బోర్డు మండిపడింది. ఏప్రిల్‌ తర్వాతే అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభించాలని సూచించింది.

ఒత్తిడికి బలవుతున్న జీవితాలు

చదువు, పరీక్షల ఒత్తిడి కారణంగా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో పరీక్ష ఒత్తిడి కారణంగా 10వ తరగతి విద్యార్థి తాను అద్దెకుంటున్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరికి వేలాడుతున్న ఆ విద్యార్థి మృతదేహాన్ని చూసిన ఆ ఇంటి యజమాని గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. విద్యారంగంలోని పోటీతో పిల్లలు ఎంతమేర ప్రభావం అవుతున్నారు, దాంతో వాటి చుట్టూ ఉన్నవారు ఎంత ప్రభావం అవుతున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. కేవలం చదువు, మార్కులే లక్ష్యంగా మారిన మన విద్యావ్యవస్థలో లోపాన్ని మరోసారి ఎత్తిచూపింది.

అకాడమిక్‌ క్యాలెండర్‌ ఫాలో అవ్వాల్సిందే

ఇలాంటి ఘటనలు కొన్ని మాత్రమే వెలుగుచూస్తున్నాయి. బయటకు తెలియనవి చాలానే ఉన్నాయి. వీటికి పాఠశాలలు కూడా ఓ ప్రధాన కారణం. పోటీ పేరుతో త్వరాగా సిలబస్‌ పూర్తి చేసి పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. తమ స్టూడెంట్స్‌ ఇక్కడ మానేసి వేరే స్కూల్‌ జాయిన్‌ అవ్వకుండా ఏప్రిల్‌ కన్నా ముందే పై తరగతులు సిలబస్‌ ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్‌ 1 కన్నా ముందే అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభించేస్తున్నారు. ఇకపై అలాంటివి కుదరదని, ఖచ్చితంగా అకడమిక్‌ క్యాలెండర్‌ను ఫాలో అవ్వాల్సిందేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) చెప్పింది. ఏప్రిల్ 1 లోపు సెషన్‌ను ప్రారంభించవద్దని సర్క్యులర్ జారీ చేసింది.

ఇవి కూడా ముఖ్యం

పిల్లలకు చదువు ఒక్కటే లోకం కాదని, లైఫ్ స్కిల్స్, వ్యాల్యూ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్ వంటి పాఠ్యేతర అంశాలు కూడా ముఖ్యమని సీబీఎస్‌ఈ బోర్డు సూచించింది. ఇవన్నీ నిర్వహించడానికి సంవత్సరం అనేది సరిపోయే సమయం అని, దీన్ని తగ్గించొద్దని చెప్పింది. తక్కువ టైంలోనే ఏడాది కోర్సును పూర్తి చేస్తే నేర్చుకోడానికి పిల్లలు ఆందోళనకు గురవుతారని, ఆందోళన చెందుతారని చెప్పింది.

అనుబంధ పాఠశాలలు

సీబీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో అకడమిక్‌ సెషన్‌ ఏప్రిల్‌ 1తో ప్రారంభమై మార్చి 31 వరకు కొనసాగేలా ప్రిన్సిపాల్స్‌ పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం సీబీఎస్‌ 10th, 12th పరీక్షలు జరుగుతుండగా 10th క్లాస్‌ మార్చి 21తో, 12th క్లాస్‌ ఏప్రిల్‌ 5తో పూర్తవుతాయి.

First published:

Tags: Career and Courses, Cbse exams, Exams, JOBS

ఉత్తమ కథలు