హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

School Holidays In October: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ లో సెలవులే సెలవులు..

School Holidays In October: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ లో సెలవులే సెలవులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వచ్చే నెల(అక్టోబర్) ఈ సంవత్సరం అత్యంత సెలవు నెలగా చెప్పుకోవచ్చు. ఇటు బ్యాంక్ కు అయినా.. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు అయినా.. విద్యార్థులకు అయినా సెలవులు ఎక్కువగా ఉన్న నెలగా పేర్కొనవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వచ్చే నెల(October) ఈ సంవత్సరం అత్యంత సెలవు నెలగా చెప్పుకోవచ్చు. ఇటు బ్యాంక్ కు అయినా.. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు(Private and Government Employees) అయినా.. విద్యార్థులకు అయినా సెలవులు ఎక్కువగా ఉన్న నెలగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ మాసంలో ఎన్నో పండుగలు జరుగుతాయి. అక్టోబర్ నెలలో లాంగ్ హాలిడేస్(Long Holidays) వస్తున్నాయి. ఈ సెలవుల్లో కుటుంబంతో సమయాన్ని గడపవచ్చు. అలాగే పిల్లలతో సెలవులను ప్లాన్ చేయడానికి ఇది ఉత్తమ సమయం. మీరు పిల్లలతో సమయాన్ని గడపాలనుకుంటే, మీరు ఈ నెలలో ట్రిప్(Holidays Trip) మొదలైనవాటిని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మాసంలో దసరా(Dussehra), దీపావళి(Deepavali) పండుగలను ఇంట్లోనే ఉండి జరుపుకోవచ్చు. అక్టోబర్ నెలలో 11 సెలవులు ఉన్నాయి.

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు ప్రకటించగా.. ఆదివారాలు, దీపావళి పండును కలుపుకొని ప్రభుత్వం సెలవులు 11 వచ్చాయి. ఆదివారాలతో కలిపి మొత్తం 11 సెలవులు ఉండడంతో విద్యార్థులు 20 రోజులు మాత్రమే పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ , ఏపీ విద్యార్థులు అయితే కేవలం 10 నుంచి 12 రోజలు మాత్రమే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, దసరా మరియు దీపావళి పండుగలు ఉన్నాయి. విద్యార్థులు ఈ సెలవులను ఇంట్లో కూడా ఆనందించవచ్చు. ఈ నెలలో 2,9,16,23 మరియు 30 అనే ఐదు ఆదివారాలు ఉన్నాయి.

AP-TS Postal GDS Results: పోస్టల్ జీడీఎస్ ఫలితాలు.. ఐదో లిస్ట్ ను ప్రకటించిన అధికారులు..

ముఖ్యమైన రోజులు ఇవే.. 

అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి (ఆదివారం)

అక్టోబర్ 5 - దసరా (బుధవారం)

అక్టోబర్ 8 - మిలాద్ ఉన్-నబి (శనివారం)

అక్టోబర్ 9 - మహర్షి వాల్మీకి జయంతి (ఆదివారం)

DRDO Jobs 2022: DRDOలో అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు.. కొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ.. 

అక్టోబర్ 23 - నరక్ చతుర్దశి (ఆదివారం)

అక్టోబర్ 24 - దీపావళి (సోమవారం)

అక్టోబర్ 25 - గోవర్ధన్ పూజ (మంగళవారం)

అక్టోబర్ 26 - భాయి దూజ్ (బుధవారం)

అక్టోబర్ 30 - ఛత్ పూజ (ఆదివారం)

ఈ సంవత్సరం 150 హాలిడేస్.. 

ఈ సంవత్సరం 2022లో 53 రోజులు పాఠశాల-కళాశాలలు మూసివేయబడతాయి. మరోవైపు వీటికి ఆదివారం సెలవులను జోడిస్తే 2022లో మొత్తం 52 ఆదివారాలు ఉన్నాయి. రెండింటినీ కలిపితే దాదాపు 105 రోజులు అవుతున్నాయి. ఆదివారం కూడా 4 సెలవులు రావడంతో 101 రోజులు స్కూలు బంద్ గా ఉండనున్నాయి.  ఈ సెలవుల్లో వేసవి సెలవులు చేర్చబడలేదు. వేసవి సెలవులు కూడా కలుపుకుంటే 150 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉన్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: Bank Holidays, Career and Courses, Holidays, JOBS, School holidays

ఉత్తమ కథలు