STUDENTS FOLLOW THESE STEPS REGISTER FOR AN AICTE INTERNSHIP UMG GH
AICTE Internships: ఏఐసీటీఈ ఇంటర్న్‌షిప్‌కి ఇలా దరఖాస్తు చేసుకోండి.. ఎలిజిబిలిటీ అండ్ ఫుల్ డీటైల్స్ ఇవిగో..!
ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌కు అప్లయ్ చేసుకోండి.
ఇంటర్న్‌షిప్‌ల కోసం విద్యార్థులు పడే అవస్థలను గమనించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంటర్న్‌షిప్‌ల అవకాశాలు అందించడం ప్రారంభించింది. ఇండస్ట్రీలో సమర్థవంతంగా పని చేసేంత అనుభవాన్ని విద్యార్థుల్లో నింపడంతోపాటు వారిని పని చేయడానికి సన్న?
ఇండస్ట్రీలో ఇంటర్న్‌షిప్ (Internships)లు పొందడానికి విద్యార్థులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పని అనుభవం పొందాలనే కోరిక వృత్తి విద్యను అభ్యసించే దాదాపు అందరి విద్యార్థుల్లో ఉంటుంది కానీ ఇంటర్న్‌షిప్ అవకాశాలు పొందడం చాలా కష్టం. అయితే ఇంటర్న్‌షిప్‌ల కోసం విద్యార్థులు పడే అవస్థలను గమనించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంటర్న్‌షిప్‌ల అవకాశాలు అందించడం ప్రారంభించింది. ఇండస్ట్రీలో సమర్థవంతంగా పని చేసేంత అనుభవాన్ని విద్యార్థుల్లో నింపడంతోపాటు వారిని పని చేయడానికి సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఏఐసీటీఈ ఇంటర్న్‌షిప్‌లను ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వ మద్దతు ఉన్న ఏఐసీటీఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను తమ సంస్థకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల (Government Colleges Affiliated With AICTE) ద్వారా అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ల్లో ఎంపికైన వారు రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్, డిజిటల్ బ్యాడ్జ్, కోర్సు పూర్తయిన సర్టిఫికేట్ అందుకోవచ్చు. విద్యార్థులు వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు పొందవచ్చు.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో నీట్ విద్యార్థుల హల్ చల్ ..? ట్విటర్లో హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండింగ్ ..!
ఏఐసీటీఈ ఇంటర్న్‌షిప్‌లో చేరడం ద్వారా విద్యార్థులు ట్రైనింగ్, స్టైపెండ్ (Stipend), ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్ వంటి ప్రయోజనాలు దక్కించుకోవచ్చు. ఏఐసీటీఈ కేంద్ర విద్యా శాఖతో కలిసి 2025 నాటికి కోటి ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించాలని లక్ష్యం పెట్టుకుంది. మరి ఈ ఇంటర్న్‌షిప్స్‌లో చేరాలంటే కావాల్సిన అర్హతలతో పాటు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* కావాల్సిన అర్హతలు
- ప్రస్తుతం ఇంజనీరింగ్ లేదా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్లలో BE, BTech, ME, MTech, MCA, లేదా డిప్లొమా చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- విద్యార్థులు రెండు నెలల పాటు అందుబాటులో ఉండాలి.
- విద్యార్థి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ ప్రకటించిన తేదీ.. ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ మధ్య వ్యవధి 18 నెలలు మించకూడదు.
* ఇంటర్న్‌షిప్‌ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా
1. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న విద్యార్థులు మొదటగా AICTE ఇంటర్న్‌షిప్ వెబ్‌సైట్‌కి లేదా ఈ https://internship.aicte-india.org/register_new.php లింక్‌పై క్లిక్ చేయాలి.
2. ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత AICTE రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫారం ఓపెన్ అవుతుంది. పైభాగంలో AICTE అనుబంధ సంస్థల్లో డిప్లొమా/ఇంజనీరింగ్/MBA చదువుతున్నారా లేదా Non-AICTE సంస్థల్లో UGC/IGNOU/ఇతర వాటిలో చదువుతున్నారా ఒక ఆప్షన్ అని అడుగుతుంది. ఆ రెండు ఆప్షన్లలో ఒక దాన్ని ఎంచుకోవాలి.
3. ఆపై పేరు, స్టూడెంట్ ఐడీ, ఆధార్ నంబర్ వంటి కావాల్సిన వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
4. రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలన్నీ అందించి (Register) బటన్‌పై క్లిక్ చేశాక మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కి యాక్టివేషన్ లింక్ సెండ్ అవుతుంది.
5. ఆ మెయిల్ ఓపెన్ చేసి మీ రిజిస్ట్రేషన్‌ని యాక్టివేట్ చేసి, ఆపై మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. AICTE డ్యాష్‌బోర్డ్ ఇప్పుడు కనిపిస్తుంది. అప్పుడు ప్రొఫైల్‌లో అవసరమైన డీటెయిల్స్ అందించి ప్రొఫైల్‌ను కంప్లీట్ చేయాలి.
6. తరువాత రెజ్యూమ్, కవర్ లెటర్, కాలేజ్ రిఫరెన్స్ లెటర్ మొదలైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
7. తర్వాత మీ అర్హతల ప్రకారం, మీకు అందుబాటులో ఉన్న అన్ని ఇంటర్న్‌షిప్ అవకాశాలు కనిపిస్తాయి. వాటిలో మీకు ఆసక్తి ఉన్న ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.