Online classes effects: ఆన్​లైన్​ క్లాసులతో పిల్లలకు మెల్లకన్ను.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు

ప్రతీకాత్మక చిత్రం..( పక్కన) డా, పాలక్​

లాక్‌డౌన్‌ కారణంగా చదువులు లేదా ఇతర అవసరాల కోసం కంప్యూటర్లు(computers), ల్యాప్‌టాప్స్‌(laptops), మొబైల్‌ ఫోన్లు(mobile phones) లేదా ట్యాబ్లెట్లతో దగ్గర నుంచి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతే కాదు ఇందులో మధ్య మధ్యలో విరామం తీసుకోకుండా కూడా పనిచేయాల్సి ఉంటుంది. కంటి (eye)మీద పడే ఈ ఒత్తిడి మెల్లకన్ను(Esotropia)కు దారితీయవచ్చు. అంతేకాదు మయోపియా కూడా వస్తున్నట్లు తెలిసింది.

 • Share this:
  ఆన్​లైన్ పాఠాలు(online classes) పిల్లలకు శాపం కాబోతున్నాయా? పలు పరిశోధనలు అవే చెబుతున్నాయి. కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా ఆన్​లైన్​లోనే విద్యార్థులు(students)  పాఠాలు వింటున్నారు. అయితే ఇలా డిజిటల్​ క్లాసులు వింటున్న పిల్లల్లో కంటి(eye) సమస్యలు తలెత్తుతున్నాయట.  స్క్రీన్​ చూసే సమయం పెరుగుతున్న కారణంగా భారతదేశంలో పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో మయోపియా (myopia) అంటే దగ్గరి చూపు అధికమవుతోందట.  ఇది పిల్లల్లో రోజురోజుకీ  విస్తరిస్తోందట. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల చికిత్స విభాగాల గణాంకాల ప్రకారం విద్యార్థుల్లో మెల్ల కన్ను(Esotropia) సమస్య కూడా తీవ్రమవుతోందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ కేసులు 2020 నుంచి భయం గొల్పే రీతిలో పెరుగుతున్నాయని తెలంగాణలోని డాక్టర్‌ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్‌( Dr. Agarwals Eye Hospital) ఇటీవల రిపోర్టులో వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా చదువులు లేదా ఇతర అవసరాల కోసం కంప్యూటర్లు(computers), ల్యాప్‌టాప్స్‌(laptops), మొబైల్‌ ఫోన్లు(mobile phones) లేదా ట్యాబ్లెట్లతో దగ్గర నుంచి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతే కాదు ఇందులో మధ్య మధ్యలో విరామం తీసుకోకుండా కూడా పనిచేయాల్సి ఉంటుంది. కంటి (eye)మీద పడే ఈ ఒత్తిడి మెల్లకన్ను(Esotropia)కు దారితీయవచ్చు. అంతేకాదు దగ్గరి చూపు ప్రభావాన్ని పెంచుతుంది. పుస్తకాలు(books), పేపర్‌ ఆధారిత మెటిరీయల్‌ సహ కాంతిని వెదజల్లే డిజిటల్(digital) పరికరాలన్నీ అన్ని కూడా మయోపియా(myopia) పెరుగుదలకు కారణం. కాంతి(light)ని వెదజల్లే డిజిటల్‌ పరికరాల కారణంగా కళ్లు పొడిబారటం, ఫొటో సెన్సిటివిటీ వంటి ఇతర సమస్యలూ ఏర్పడవచ్చు. అయితే పిల్లల(children)ను ఈ రోగాలు రాకుండా చూసుకోవాలంటే ఏంచేయాలి.. చికిత్సా విధానాలేంటి.. అసలు ఎవరెవరు మయోపియా, మెల్లకన్ను బారిన పడే అవకాశం ఉందో తెలుసుకుందాం...

  తెలంగాణ (Telangana) లోని అగర్వాల్​ కంటి(eye) ఆసుపత్రికి చెందిన Consultant Ophthalmologist (నేత్ర వైద్యురాలు). డా. పాలక్​ మాక్వానా(Dr. Palak Macwana) మాట్లాడుతూ.. ‘‘ 5-15 ఏళ్ల వయస్సులోపు పిల్లల్లో మయోపియా(myopia) వ్యాధి ఏడాదిలోనే 100% పెరిగింది. అలాగే పిల్లల్లో మెల్ల కన్నుసమస్యలు ఐదు రెట్ల పెరిగినట్లు కనిపిస్తోంది. 2020లో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఈ వయస్సు పిల్లల్లో మయోపియా ఏర్పడటం రెట్టింపు అయింది. అంతర్జాతీయంగా కూడా ఇవే పోకడలు కనిపిస్తున్నాయి”అని తెలిపారు. పిల్లల కంటి ఆరోగ్యం, భద్రతా అవగాహన కోసం భారతదేశంలోని అతిపెద్ద నేత్ర(eye) సంరక్షణ కేంద్రాలు కలిగిన డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏటా ఆగస్టులో దీన్ని నిర్వహిస్తామని Dr. Palak Macwana తెలిపింది. ఆమె మాట్లాడుతూ “ ఇటీవల కరోనా కారణంగా పిల్లల్లో తీవ్రమైన కమిటెంట్ ఈసోట్రోపియా కేసుల సంఖ్యలో అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోంది. కొవిడ్‌-19కి ముందు మా ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు 1 లేదా 2 చూసేవాళ్లం, కానీ, నేడు 10 కేసులకు మించి చూస్తున్నాం. అంతే కాదు మయోపియా విస్తరిస్తుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. పిల్లల్లో 100% పెరుగుదలను మేం చూస్తున్నాం” అన్నారు.

  మెల్లకన్ను(Esotropia), మయోపియా(myopia) రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి “దగ్గర నుంచి పనిచేస్తుండటం”, ఇది సాధారణంగా చదవడం, రాయడం వంటి పనులతో ముడిపడి ఉంటుంది. ఫొకస్‌ చేస్తున్న వస్తువులు ( పుస్తకాలు) కంటికి మధ్య దూరం 33 సెంటీమీటర్లు ఉంటుంది. వరల్డ్ సొసైటీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ ఆప్తామాలజీ అండ్‌ స్ట్రాబిస్మస్‌ కన్సెన్సస్‌(wspos)  ప్రకారం దగ్గరగా చూస్తూ దగ్గర నుంచి పని చేయడం వలన అనేక సమస్యలు తలెత్తడమే కాదు అది మెల్లకన్నుకు దారితీస్తుంది. కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే చర్యల గురించి Dr. Palak Macwana మాట్లాడుతూ..  వరల్డ్ సొసైటీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ ఆప్తామాలజీ అండ్‌ స్ట్రాబిస్మస్‌ కన్సెన్సస్‌ ప్రకారం తరుచూ విరామం తీసుకొని చేసే పనులతో పోల్చితే స్థిరంగా కూర్చొని దగ్గర నుంచి పనిచేయడం వలన మయోపియా పెరిగే ప్రభావం ఎక్కువుంటుంది. అంటే మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ మూడు గంటలు కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ ముందు గడిపే పిల్లవాడితో పోల్చితే కదలకుండా ఒక గంట సేపు సమయం గడిపిన వారిలో కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి” అని అన్నారు.

  తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

  ఆన్‌లైన్‌ క్లాసులు తప్పనిసరి అయినప్పుడు మొబైల్‌ ఫోన్ల స్థానంలో పిల్లలు ల్యాప్‌టాప్స్‌/డెస్క్‌టాప్స్‌ ఉపయోగించేలా తల్లిదండ్రులు  చూడాలని  Dr. Palak Macwana సూచించారు.  మొబైల్‌ ఫోన్ స్క్రీన్లతో పోల్చితే కంప్యూటర్లు, కంటికి మధ్య దూరం ఎక్కువుంటుందని వివరించారు. అంతే కాదు కుదిరితే పిల్లలు బయట ఆడుకునేలా చూడాలని, రోజుకు  గంట నుంచి 2 గంటల పాటు సూర్యరశ్మి అందడం ముఖ్యమని అన్నారు. సమగ్ర ఎదుగుదల కోసం ఆరోగ్యకరమైన, చక్కని సమతుల ఆహారం అవసరమని తెలిపారు.

  చికిత్సా పద్దతులున్నాయా..?

  మయోపియాకు సంబంధించి సరికొత్త చికిత్సల గురించి Dr. Palak Macwana మాట్లాడుతూ.. ‘‘మయోపియా పెరుగుదలను అరికట్టేందుకు తక్కువ డోస్‌ ఆట్రోపిన్‌ ఐ డ్రాప్స్‌, ప్రోగ్రెసివ్‌ అడిషన్‌ లెన్సులు, మల్టీఫోకల్‌ స్పెక్టకల్స్‌, ఆర్తోకెరటాలజీ, ఆర్‌జీపీ వంటి ప్రత్యేక కాంటాక్ట్‌ లెన్సులు వంటివి చికిత్సా ఆప్షన్స్. కాని కమిటెంట్‌ ఈసోట్రోపియా వంటి తీవ్రమైన వాటిని సరిదిద్దడం సాధ్యం కాదు. ఇలాంటి కేసుల్లో రెండు కళ్లలో చూపు పునరుద్ధరించేందుకు స్ట్రాబిస్మస్‌ సర్జరీ తప్పనిసరి’’ అని అనారు. భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో దగ్గరి చూపు సమస్య ఏర్పడుతోందని, దాన్ని చక్కదిద్దేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. దగ్గరి చూపు సమస్య తీవ్రమైతే దాని కారణంగా క్యాటరాక్ట్ త్వరగా రావచ్చు. అంతే కాదు ఒపెన్‌-యాంగిల్‌ గ్లాకోమా, రెటినల్‌ డిటాచ్‌మెంట్‌, ఆట్రోఫిక్‌ మయోపిక్‌ మ్యాకులోపతి, మయోపిక్‌ స్ట్రాబిస్మస్‌ ఫిక్సస్‌ వంటివి ఏర్పడే ముప్పు ఉంటుంది. మయోపియా పెరగడం వలన వ్యక్తికే కాదు దేశానికి కూడా ఆర్థికంగా భారమవుతుంది.
  Published by:Prabhakar Vaddi
  First published: