CA Foundation Course: పది పూర్తవగానే సీఏ ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్.. పూర్తి వివరాలివే

CA Foundation Course: సీఏ ఫౌండేషన్ కోర్సులో ప్రవేశాలకు నిబంధనలు మారుస్తూ ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా(ICAI) నిర్ణయం తీసుకుంది. పది పాసైన అనంతరం ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

news18-telugu
Updated: October 21, 2020, 3:32 PM IST
CA Foundation Course: పది పూర్తవగానే సీఏ ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సీఏ ఫౌండేషన్ కోర్సులో ప్రవేశాలకు నిబంధనలు మారుస్తూ ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా(ICAI) నిర్ణయం తీసుకుంది. పది పాసైన అనంతరం ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా అభ్యర్థులు ఆరు నెలల ముందే చార్టెర్డ్ అకౌంటెంట్ అయ్యే అవకాశం ఏర్పడింది. కాకపోతే.. విద్యార్థులు క్లాస్12 పాసైన తర్వాతనే వారి అడ్మిషన్ అమలులోకి వస్తుంది. గతంలో విద్యార్థులు కేవలం 12వ తరగతి తర్వాత మాత్రమే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం పది పూర్తైన తర్వాత విద్యార్థులు పది పాసైన అనంతరం విద్యార్థులు ఫౌండేషన్ కోర్సు కోసం రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇటీవలే అనుమతి పొందింది. ఈ విషయంపై ICAI ప్రెసిడెంట్ అతుల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు.

సీఏ ఫౌండేషన్ కోర్సు పాస్ అవ్వడానికి వారు మరింత నాలెడ్జ్ పెంపొందించుకునేందుకు తగు సమయం దొరుకుతందని గుప్తా అన్నారు. ఫౌండేషన్ విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ తరగతులను అందిస్తున్నామని తెలిపారు. ICAI తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు ఆరు నెలల ముందుగా చార్టెర్డ్ అకౌంటెంట్ గా మారే అవకాశం కలగనుందని తెలిపారు. 12 పరీక్షలు సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉంటాయి. దీంతో విద్యార్థులు మే-జూన్ నెల్లలో ఫౌండేషన్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధిస్తారని ఐసీఏఐ ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉంటే... కరోనా నేపథ్యంలో దేశంలో అనేక పరీక్షలను వాయిదా వేశారు. కొన్ని పరీక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పడు కొన్ని ప్రవేశ పరీక్షలను కరోనా నిబంధనలను పాటిస్తూ.. అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటూ నిర్వహిస్తున్నారు. ఏపీలో ఏటా పది పరీక్షల ఫలితాల ఆధారంగా ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలను నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా పది పరీక్షలను ప్రభుత్వం నిర్వహించలేదు.

దీంతో 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల మార్కులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఎలా నిర్వహించాలన్న అంశంపై ఇన్నాళ్లు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇందుకోసం ఆర్జీయూకేటీ చట్టంలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్ష నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కు సూచించారు.
Published by: Nikhil Kumar S
First published: October 21, 2020, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading