Home /News /jobs /

STUDENTS ASK TO POSTPONE NEET UG 2022 EXAM BUT EDUCATION MINISTER SAYS NOT POSSIBLE UMG GH

NEET UG: నీట్ ఎగ్జామ్ వాయిదాకు డిమాండ్.. విద్యాశాఖ మంత్రి స్పందన ఏంటంటే..?

నీట్ ఎగ్జామ్ వాయిదా..?

నీట్ ఎగ్జామ్ వాయిదా..?

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ నీట్ పరీక్ష నిర్వహణపై ఒక ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో దాదాపు 94 శాతం మంది అభ్యర్థులు నీట్ వాయిదా వేయాలని కోరుతూ ఓటు వేశారు. అయితే, నీట్- 2022 వాయిదా డిమాండ్లు నెరవేరేటట్లు కనిపించడం లేదు.

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ (Medical) కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- యూజీ (NEET UG) పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష విషయంలో నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ (NTA), అభ్యర్థుల మధ్య వివాదం కొనసాగుతోంది. నీట్ (NEET) వాయిదా కోరుతూ అభ్యర్థులు #PostponeNEETUG2022 అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఇది గత కొంతకాలం నుంచి సాగుతోంది. తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ టైమ్స్ నౌ న్యూస్.. నీట్ పరీక్ష నిర్వహణపై ఒక ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఇందులో దాదాపు 94 శాతం మంది అభ్యర్థులు నీట్ వాయిదా వేయాలని కోరుతూ ఓటు వేశారు. అయితే, నీట్- 2022 వాయిదా డిమాండ్లు నెరవేరేటట్లు కనిపించడం లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నీట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీట్ వాయిదా వేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.

నీట్-2022 విషయంలో అభ్యర్థుల దారి ఒకటైతే... అధికారుల తీరు మరోలా ఉంది. అయినప్పటికీ చాలా మంది అభ్యర్థులు, ఇంకా నీట్ వాయిదా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతాలకు #PostponeNEETUG2022ను ట్యాగ్ చేస్తున్నారు. సోషల్ మీడియా NEET 2022 వాయిదా అభ్యర్థనలతో నిండిపోయింది.



టైమ్స్ నౌ ఎడ్యుకేషన్ నిర్వహించిన ట్విట్టర్ పోల్‌లో దాదాపు 94% మంది ఇప్పటికీ నీట్ వాయిదాకు అనుకూలంగా ఓటు వేశారు. నీట్ యూజీ-2022 వాయిదా‌కు సంబంధించి మూడు ఆప్షన్‌లతో నిర్వహించిన ట్విట్టర్ పోల్‌కు 12వేల ఓట్లు వచ్చాయి. కేవలం 5 శాతం మంది మాత్రమే ‘నీట్ వాయిదా వేయవద్దు’ అనే ఆప్షన్‌కు ఓటు వేశారు. ఇక ఒక శాతం మంది ‘ఏ నిర్ణయం తీసుకోలేదు’ అనే ఆప్షన్‌కు ఓటు వేశారు. మరి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్-2022 జరుగుతుందా? లేదా అభ్యర్థుల డిమాండ్‌కు తలొగ్గి నీట్ వాయిదా వేస్తారో లేదో చూడాలి.

మరోవైపు, నీట్-2022 ఎగ్జామ్ సిటీ స్లిప్‌లను ఎన్‌టీఏ విడుదల చేసింది. దీంతో నీట్ అడ్మిట్ కార్డులు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా నీట్ యూజీ అడ్మిట్ కార్డ్‌లు పరీక్షకు 10 నుంచి 15 రోజుల ముందు జారీ చేస్తారు. ఈ ఏడాది జులై 17న నీట్ జరగనుంది. కాబట్టి త్వరలోనే అడ్మిట్ కార్డ్ జారీ కానున్నాయి.

* అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ విధానం

స్టెప్-1: ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను సందర్శించాలి.

స్టెప్-2: NEET UG 2022 అడ్మిట్ కార్డ్ అనే లింక్‌పై క్లిక్ చేయండి

స్టెప్-3: అప్లికేషన్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి

స్టెప్-4: నీట్-2022 అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.

స్టెప్-5: అడ్మిట్ కార్డులోని వివరాలను చెక్ చేయండి.

స్టెప్-6: చివరగా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రింటవుట్ తీసుకోండి.

కాగా, నీట్-2022 పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ సీట్లు 92,065, బీడీస్ 26,949 సీట్లు, ఆయుష్ స్టేజ్- 8 సీట్లు 52,720, BVSc 525 సీట్లతో పాటు ఏహెచ్ సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Exams, JOBS, NEET, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు