Home /News /jobs /

STUDENTS APPEARING FOR THE CUET EXAM WILL HAVE A CHANCE TO SCORE GOOD MARKS IF THEY FOLLOW THE RULES MENTIONED BELOW GNT VB

CUET Exam: సీయూఈటీ పరీక్ష రాసే విద్యార్థులకు అలర్ట్.. వీటిని తప్పక తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశం లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల లో చదువుకునేందుకు జరిగే అర్హత పరీక్షా సియూఈటి . డిగ్రీ లోని కామర్స్ లో జాయిన్ అయ్యేందుకు పరీక్షా రాసే విద్యార్థులకు సిలబస్ ఈ విధంగా ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India
    (Anna Raghu, News 18, Guntur)

    భారతదేశం లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల లో(Universities) చదువుకునేందుకు జరిగే అర్హత పరీక్షా సియూఈటి . డిగ్రీ లోని కామర్స్ లో జాయిన్(Commerce) అయ్యేందుకు పరీక్షా రాసే విద్యార్థులకు సిలబస్(Syllabus) ఈ విధంగా ఉంటుంది. సియూఈటి పరీక్ష కు ఇంటర్ మరియు సిబిఎస్సీ పన్నెండోవ తరగతి పరీక్షలకు హాజరైనవారు అర్హులు.ఈ పరీక్ష ఆన్లైన్ విధానం లో(Online Mode) ఉంటుంది . 2 విభాగాలుగా పరీక్ష ఉంటుంది. మొదటి విభాగం మూడు గంటల పదిహేను నిముషాలు రెండవ విభాగం రెండు గంటల పదిహేను నిమిషాల సమయం ఉంటుంది. ఈ పరీక్ష బిట్స్ రూపంలో ఉంటుంది.

    RRB Group D Update: రైల్వే గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ D పరీక్షలపై తాజా అప్ డేట్..


    సియూఈటి కి సంబంధించి కామర్స్ గ్రూప్ వారికీ 1 .అకౌంటెన్సీ ,2 .బిజినెస్ స్టడీస్ 3 .ఎకనామిక్స్  4 ఫిజికల్ ఎడ్యుకేషన్ 5 .ఇంగ్లీష్ 6 .మ్యాథమెటిక్స్ తో పాటు జనరల్ టెస్ట్ ఉంటుంది. ఈ జనరల్ టెస్ట్ లో జనరల్ నాలెడ్జి , కరెంటు అఫైర్స్ , మెంటల్ ఎబిలిటీ , న్యూమరికల్ ఎబిలిటీ , కాపిటేటివ్ రీజనింగ్స్ , లాజికల్ మరియు ఎనలిటికల్ రీజనింగ్స్ గురించి ప్రశ్నలు ఉంటాయి. ఐతే జనరల్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది కావాలనుకునేవారు రాయొచ్చు. ఈ జనరల్ టెస్ట్ రాయటం వలన భారత దేశం లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చేరేందుకు అర్హత సాధించే క్రమం లో జనరల్ టెస్ట్ మర్క్స్ బాగా ఉపయోగపడుతాయి.


    మొదటి విభాగం లో..  

    1 .అకౌంటెన్సీ ,2 .బిజినెస్ స్టడీస్ 3 .ఎకనామిక్స్   మరియు జనరల్ టెస్ట్ ఉంటుంది. జనరల్ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఒకొక సబ్జెక్టు కు యాబై ప్రశ్నలు ఉంటాయి. వాటిలో నలబై ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒకొక సబ్జెక్టు కు సమయం నలబై ఐదు నిముషాల సమయం ఉంటుంది. సరి ఐయిన సమాధానం రాసిన ప్రశ్నకు ఐదు మార్కులు, తప్పు సమాధానం రాసిన ప్రశ్నకు ఒక మార్క్ మైనస్ చేస్తారు. మూడు సబ్జెక్టులకు ఒక్కొక్కటి నలబై ఐదు నిమిషాల సమయం ఉంటుంది . ఒకదాని తరువాత మరొక సబ్జెక్టు పేపర్ ఓపెన్ అవుతుంది . మొత్తం పరీక్ష రెండు గంటల పదిహేను నిముషాల సమయం జనరల్ టెస్ట్ ఎంచుకున్నట్లైతే మరో గంట సమయం అదనం గా లభిస్తుంది. నెగిటివ్ మార్కు ఉంది కాబట్టి విద్యార్థులు అలోచించి జాగ్రత్తగా సమాధానములు పెట్టాలి.

    రెండవ విభాగం లో..
    ఫిజికల్ ఎడ్యుకేషన్ , ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ లకు  ఒకొక సబ్జెక్టు కు యాబై ప్రశ్నలు ఉంటాయి. వాటిలో నలబై ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒకొక సబ్జెక్టు కు సమయం నలబై ఐదు నిముషాల సమయం ఉంటుంది. సరి ఐయిన సమాధానం రాసిన ప్రశ్నకు ఐదు మార్కులు, తప్పు సమాధానం రాసిన ప్రశ్నకు ఒక మార్క్ మైనస్ చేస్తారు. మూడు సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్ట్ కు నలబై ఐదు నిమిషాల సమయం ఉంటుంది. ఒకదాని తరువాత మరొక సబ్జెక్టు పేపర్ ఓపెన్ అవుతుంది . మొత్తం పరీక్ష రెండు గంటల పదిహేను నిముషాలు ఉంటుంది. నెగిటివ్ మార్కు ఉంది కాబట్టి  విద్యార్థులు అలోచించి జాగ్రత్తగా సమాధానములు పెట్టాలి. విద్యార్థులు సమయపాలన పాటించి పరీక్ష రాయాలి.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, Cuet, CUET 2022, Exam Tips, Exams, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు