పెరుగుతున్న ద్రవ్యోల్బణం(Inflation) విద్యా రంగంపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది నిత్యావసర వస్తువులతో పాటు విద్యా వస్తువులపై జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దీంతో కార్యాలయంపై భారంతోపాటు ఖర్చు కూడా పెరిగింది. స్కూల్ ఫీజులు కూడా భారీగా పెరిగాయి. దానితో పోలిస్తే ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న వివిధ ఉపకార వేతనాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. స్కాలర్షిప్ (Scholarship) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఈ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి బాలలే రేపటి భావి పౌరులు.. దేశ భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉంది. వారికి మంచి విద్య అందిస్తేనే భవిష్యత్ లో ఉన్నతంగా ఎదుగుతారు. కేవలం ఆర్థిక కారణాలతో విద్యార్ధుల విద్యాహక్కును హరించకూడదు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యార్థులకు 14 రకాల ఉపకార వేతనాలు అందజేస్తున్నారు. ఇందులో వివిధ స్కాలర్షిప్ పథకాలు ఉన్నాయి. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర విద్యా అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది.
అయితే.. గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం గ్రాఫ్ పెరగడం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ ఏడాది నుంచి నిత్యావసర వస్తువులు.. విద్యా సామగ్రిపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. కాబట్టి విద్య ఖరీదైనదిగా మారింది. V మరియు VIII తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఈ స్కాలర్షిప్ మొత్తానికి సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కారణం.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచాలని స్కాలర్షిప్ హోల్డర్లు డిమాండ్ చేయడం ప్రారంభించారు. కానీ.. గత కొన్నేళ్లుగా ఇది పెరగలేదు. ఇచ్చే స్కాలర్ షిప్ సైతం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
విద్యార్థుల సంఖ్య తగ్గింది
విద్యార్ధులను విద్య పట్ల ప్రోత్సహించాలి. విద్య ద్వారా పిల్లలను శక్తివంతం చేయడానికి, అధిక డ్రాపౌట్ రేటును తగ్గించడానికి.. తమ పిల్లలను పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి, విద్య ఖర్చు భారాన్ని తగ్గించడానికి విద్యార్థులకు వివిధ స్కాలర్షిప్లు ఇవ్వబడుతున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సాహించడానికి స్కాలర్షిప్ అందించబడుతున్నాయి. అయితే ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఈ స్కాలర్షిప్ల మొత్తాన్ని పెంచకపోవడంతో కొద్దిపాటి స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది.
పెరగని స్కాలర్ షిప్..
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతి భావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని.. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ స్కాలర్షిప్ను అందిస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి పదోతరగతికి స్కాలర్షిప్ కొనసాగాలంటే.. అభ్యర్థి 55శాతం మార్కులతో ప్రమోట్ కావాలి. అలాగే పదోతరగతిలో 60శాతం మార్కులు సాధిస్తే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉపకార వేతనం అందుతుంది.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 55శాతం మార్కులతో ప్రమోట్ అయితే రెండో సంవత్సరంలో స్కాలర్షిప్ అందిస్తారు. ఇందుకోసం విద్యార్థులు ప్రతి ఏటా స్కాలర్షిప్ రెన్యూవల్ చేసుకోవాలి. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. సారథి స్కాలర్షిప్లో.. ప్రతి సంవత్సరం VIII నుండి XII వరకు రూ.9 వేల 500 వరకు స్కాలర్షిప్ మొత్తం ఇవ్వబడుతుంది. గత కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. ఈ స్కాలర్ షిప్ లల్లో.. మాత్రం ఏ మాత్రం పెరుగుదల కపిపించడం లేదు. దీని వల్ల లబ్ధిదారులు చదువుకు దూరమవుతారనే భయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Education news, JOBS, Students