కరోనా సమయంలో... ఇంట్లోనే ఉంటూ... నాలెడ్జ్ పెంచుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. జనరల్‌గా గూగుల్ సెర్చ్‌లో కనిపించని కొన్ని వింత వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు.... ఇలాంటి సైట్లు కూడా ఉన్నాయా అనిపించక మానదు. వాటిలో కొన్ని ఆసక్తి కలిగిస్తాయి, కొన్ని నాలెడ్జ్ పెంచుతాయి. మరికొన్ని ఎంటర్టైన్మెంట్ కలిగిస్తాయి. కానీ ప్రతీ వెబ్సైట్ వల్ల ఏదో ఒక ఉపయోగం మాత్రం ఉంటుంది. అలాంటి కొన్ని చిత్రమైన, ఆశ్చర్యకరమైన వెబ్సైట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
http://www.youshouldhaveseenthis.com : ఇంటర్నెట్లో ఓ పాతికేళ్ల నాటి ట్రెండింగ్ వీడియోలు చూడాలంటే... ఆ లిస్ట్ ఈ వెబ్సైట్లో ఉంది.
http://www.lunchclock.com : పని చేస్తూ టైముకి తినడం భోజనం తినడం మర్చిపోతున్నారా? ఐతే... మీకు గుర్తుచేస్తుంది ఈ సైట్. టైమ్ ఫిక్స్ చేసుకోండి మరి.
https://www.purdue.edu/impactearth : భూమిని ఏదైనా గ్రహశకలం ఢీకొట్టే ఛాన్స్ ఉందా అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... ఈ వెబ్సైట్ వివరాలు గ్రాఫిక్స్ రూపంలో ఇస్తోంది.
http://coolcosmos.ipac.caltech.edu/image_galleries/ir_zoo/index.html : జంతువులు, పక్షుల్ని ఇన్ఫ్రారెడ్ కలర్స్‌లో చూడాలంటే.. ఈ సైట్ చూపిస్తుంది. ఇది పిల్లల్లో నాలెడ్జ్‌ని పెంచుతుంది కూడా.
https://humanclock.com : ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో టైమ్ చూపిస్తూ... దిగిన ఫొటోలను ఈ వెబ్సైట్ మనకు చూపిస్తుంది.
http://phobialist.com : ప్రపంచంలో రకరకాల భయాలు ఉంటాయి. వాటన్నింటినీ ఒకే చోట తెలుసుకోవాలంటే... భయపడకుండా ఈ సైట్ లోకి వెళ్లాలి.
https://www.404pagefound.com : ప్రపంచంలో ఇంటర్నెట్ ప్రారంభమైన కొత్తలో పనిచేసిన వెబ్సైట్లను చూడాలనుకుంటే ఈ సైట్లోకి వెళ్లడమే.
https://northkoreaninteriors.tumblr.com : ఉత్తర కొరియా దేశంలో ఇళ్ల డెకరేషన్ ఎలా ఉంటుంది? ఇంటీరియర్ ఎలా డెకరేట్ చేస్తారో తెలియాలంటే... ఈ సైట్లోకి వెళ్లాల్సిందే.
https://knowyourmeme.com : ఈ రోజుల్లో వివిధ సందర్భాల్ని చెప్పేందుకు నెటిజన్లు మీమ్స్ బాగా వాడుతున్నారు. అలాంటి రకరకాల మీమ్స్ ఈ సైట్లో చూడొచ్చు.
http://brandcolors.net : ప్రపంచంలో వివిధ కంపెనీలు తమ కంటూ కొన్ని కలర్స్‌ని బ్రాండ్ కలర్స్‌గా ఎంచుకుంటాయి. ఉదాహరణకు గూగుల్‌లో నాలుగైదు కలర్స్ కనిపిస్తుంటాయి. అలా ఏం కంపెనీ ఏ కలర్స్ కలిగివుందో... ఈ సైట్లో చూడొచ్చు.
http://www.history.com/topics/halloween/history-of-halloween : హాలోవీన్ పండుగ కథా కమామిషూ మొత్తం తెలియాలంటే... ఈ సైడ్‌లో వివరంగా తెలుసుకోవచ్చు.
https://www.labnol.org/software/turn-images-into-pixel-art/12978 : గూగుల్ స్ప్రెడ్ షీట్లతో పిక్సెల్ పెయింటింగ్ వెయ్యడం ఎలాగో తెలియాలంటో ఈ సైట్ వివరిస్తోంది.
ఇది కూడా చదవండి:Kitchen Tips: కిచెన్‌లో అదిరిపోయే చిట్కాలు... పాటిస్తే మీరే స్మార్ట్ లైఫ్ పార్ట్నర్
https://freshpics.blogspot.com/2008/11/airplane-meals.html : విమానాల్లో ఆఫర్ చేసే రకరకాల ఆహారాల్ని చూడాలంటే... ఈ సైట్లో తెలుసుకోవచ్చు.