హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ChatGPT: యూడెమీలో చాట్‌జిపిటి కోర్సు.. మూడు నెలల్లో రూ.28 లక్షలు సంపాదించిన యువకుడు!

ChatGPT: యూడెమీలో చాట్‌జిపిటి కోర్సు.. మూడు నెలల్లో రూ.28 లక్షలు సంపాదించిన యువకుడు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాన్స్ జంక్ అనే 23 ఏళ్ల యువకుడు చాట్‌జిపిటిని ఎలా ఉపయోగించాలి? అనే అంశంపై ఓ కోర్సును రూపొందించాడు. ‘చాట్‌జిపిటి మాస్టర్‌క్లాస్: ఎ కంప్లీట్‌ చాట్‌జిపిటి కోర్స్‌ ఫర్‌ బిగినర్స్‌’ పేరుతో ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

    ఇంతకు ముందు ఏవైనా కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలంటే? కచ్చితంగా ఇన్‌స్టిట్యూట్‌లకు వెళ్లాల్సి వచ్చేది. పెద్ద పెద్ద నగరాలకు వెళ్తేనే నేర్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూలన కూర్చోనైనా.. నచ్చిన కోర్సును నేర్చుకోవచ్చు. ప్రస్తుతం లేటెస్ట్‌ ఏఐ టెక్నాలజీ సంచలనం ChatGPT గురించి కూడా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. Udemyలో లభిస్తున్న ఈ కోర్సులో చాట్‌జిపిటిని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలో చెబుతారు. చాట్‌జిపిటిపై అవగాహన ఉన్న నిపుణులు దీనిని ఉపాధి అవకాశంగా మార్చుకుంటున్నారు. చాట్‌జిపిటి వల్ల ఉద్యోగాల కోతలు పెరుగుతాయనే ఆరోపణలు వినిపిస్తుండడంతో.. చాట్‌జిపిటి ఉపాధి మార్గంగా నిలిచింది. ఇలా లాన్స్ జంక్ అనే యువకుడు కేవలం మూడు నెలల్లో $35,000 (సుమారు రూ.28 లక్షలు) సంపాదించాడు.

    15 వేల మంది రిజిస్ట్రేషన్‌

    బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. లాన్స్ జంక్ అనే 23 ఏళ్ల యువకుడు చాట్‌జిపిటిని ఎలా ఉపయోగించాలి? అనే అంశంపై ఓ కోర్సును రూపొందించాడు. ‘చాట్‌జిపిటి మాస్టర్‌క్లాస్: ఎ కంప్లీట్‌ చాట్‌జిపిటి కోర్స్‌ ఫర్‌ బిగినర్స్‌’ పేరుతో ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాడు. కేవలం మూడు నెలల్లో, ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఈ కోర్సు కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. అతను ఇప్పటివరకు 35,000 డాలర్లు సంపాదించాడు.

    అందరికీ అందుబాటులోకి తేవాలని?

    లాన్స్ జంక్ మాట్లాడుతూ..‘AI చాట్‌బాట్‌ సామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోయాను. చాట్‌జిపిటిని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలని కోరుకున్నాను. ఇతరులకు చాట్‌జిపిటిని ఉపయోగించడం నేర్పించడానికి ఉన్న అవకాశాలను గుర్తించాను. చాట్‌జిపిటి లాంచ్‌ అయినప్పటి నుంచి వస్తున్న వివిధ రకాల ఆరోపణలతో చాలా మంది భయపడుతున్నారు. అందుకే చాట్‌జిపిటిని ఉత్తేజకరమైనదిగా మార్చేందుకు ప్రయత్నించాను. ప్రతిరోజూ బాట్‌లో గంటల కొద్దీ సమయాన్ని గడుపుతాను. నావెల్‌కు ఇంట్రడక్షన్‌ రాయడం, ఫుడ్‌ ప్రొడక్టులకు డిస్క్రిప్షన్‌ రాయమనడం వంటి ప్రశ్నల ద్వారా బాట్‌ను ఎలా ప్రాంప్ట్ చేయాలో అర్థం చేసుకుంటాను. ఇంటర్నెట్‌లోని ప్రతి ChatGPT కంటెంట్‌ను వినియోగిస్తాను.’ అని చెప్పాడు. జంక్ చాట్‌జిపిటిపై ఎటువంటి అఫిషియల్‌ ట్రైనింగ్‌ పొందలేదు. అతను స్వయంగా చాట్‌జిపిటిపై పట్టు సాధించాడు.

    50 లెక్చర్స్‌తో కోర్సు:

    జంక్ రూపొందించిన చాట్‌జిపిటి కోర్సు ఏడు గంటల నిడివితో ఉంది. ప్రస్తుతం 20 డాలర్లకు అందుబాటులో ఉంది. బిగినర్స్‌ కోసం కోర్సులో మొత్తం 50 లెక్చర్స్‌ ఉన్నాయి. వీటిని రూపొందించడానికి జంక్‌కు దాదాపు మూడు వారాలు పట్టింది. జంక్ కోర్సు కోసం రిజిస్టర్‌ చేసుకున్న వారిలో ఎక్కువ మంది యూఎస్‌కి చెందిన వారే ఉన్నారు. భారతదేశం, జపాన్‌, కెనడా, వెనిజులా, రష్యా , మిడిల్‌ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాల విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన కనిపించింది. చాట్‌జిపిటి ఇంకా అందుబాటులోకి రాని దేశాల నుంచి కూడా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారని జంక్ వివరించాడు.

    First published:

    Tags: Chatgpt

    ఉత్తమ కథలు