UGC Guideline: చ‌దువు మానేసినా.. మ‌ళ్లీ కాలేజీలో చేరొచ్చు

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది.. విద్యార్థులు ఏదైన కార‌ణంతో చ‌దువు మ‌ధ్య‌లో మానేస్తే కోర్సు మొత్తం వృథా అయ్యేది.. ఇక అలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి ఎంట్రీ-ఎగ్జిట్ నిబంధ‌న‌ల‌ను యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.

  • Share this:
    విద్యార్థులు గ్యాడ్యుయేట్, పోస్ట గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరి కొంత కాలం కోర్సు చేరాక ఏదైనా కార‌ణంతో చ‌దువు మానేస్తే చేసిన కోర్సు మొత్తం వృథా అయ్యేది. అంతే కాకుండా ఒక క‌ళాశాల‌లో చేరితే ఆ కోర్సు పూర్త‌య్యే వ‌ర‌కు ఇష్ట‌మున్నా లేకున్నా కచ్చితంగా చ‌ద‌వాల్సిందే.. అలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్రం ఉన్న‌త విద్యా విధానంలో మ‌ల్లిపుల్‌ ఎంట్రీ-ఎగ్జిట్ విధానాన్ని ప్ర‌వేశ పెట్టింది. ఈ విధానంతో విద్యార్థులు ఎప్పుడైనా చ‌దువు మానేసినా.. మ‌ళ్లీ తిరిగి అక్క‌డి నుంచే చ‌దువుకొనే అవ‌కాశం ఉంది. ఈ విధానానికి సంబంధించి యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.
    ఈ విధానాన్ని ముందుగా కేంద్రం ఆధీనంలో ఉన్న కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంలో అమ‌లు చేయ‌నున్నారు. ఈ విధానంపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఈ కార‌ణంగా రాష్ట్రంలో ఈ ఏడాది అమ‌లు ఉండ‌క‌పోవ‌చ్చు.
    నిబంధ‌న‌లు ఇవే..
    డిగ్రీలో చేరిన విద్యార్థి చ‌దువు వ‌దిలేసీ వెళ్లాలంటే ఏడాది త‌ర్వాత మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. అంటే సెమి్ట‌ర్ త‌ర్వాత వెళ్లడానికి వీళ్లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఒక క‌ళాశాల నుంచి మ‌రో దానికి 3,5,7 సెమిస్ట‌ర్‌ల‌ల‌నే మారాలి. చ‌దువు మానుకొని వెళ్లాలంటే 2,4,6,8 సెమిస్ట‌ర్లు పూర్త‌య్యాకే మానేయాలి. ఈ లోపు మానేయ‌డం కుద‌ర‌దు. మూడేళ్ల‌కు జ‌న‌ర‌ల్ డిగ్రీ చేరిన వారు ఒక‌టి, రెండో సంవ‌త్స‌రం పూర్త‌యిన త‌ర్వాత చ‌దువు మానేయ‌వ‌చ్చు. అదే రెండేళ్ల పీజీ చేరిన వారు ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం పూర్త‌యిన త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌చ్చు.
    డిగ్రీని మూడేళ్ల సాధార‌ణ కోర్సు మాదిరిగా కాకుండా నాలుగేళ్ల హాన‌ర్స్ లేదా రీసెర్చ్ కోర్సుగా చేయొచ్చు. నాలుగో సంవ‌త్స‌రం ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. మూడేళ్ల డిగ్రీ చ‌దివిన వారు రెండేళ్ల పీజీ చేయాలి. అదే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన‌వారు ఒక‌సంవ‌త్స‌రం పీజీ చ‌దువుతారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ చేసిన వారికి మూడేళ్ల త‌ర్వాత ఎగ్జిట్ ఆప్ష‌న్ ఇస్తారు. మొత్తం కోర్సులో 40శాతం క్రెడిట్ల‌ను స్వ‌యంగా పోర్ట‌ల్ ద్వారా ఆన్‌లైన్‌లో పొంద‌వ‌చ్చు. స‌ర్టిఫికెట్‌కు 36-40 క్రెడిట్‌లు, డిప్లొమాకు 72-80 క్రెడిట్లు, డిగ్రీ హాన‌ర్స్ 108-120 క్రెడిట్లు, రీసెర్చ్ డిగ్రీకి 144-160 క్రెడిట్లు ఇస్తారు. సాధారణ విద్య, ఒకేష‌న‌ల్ విద్య క‌లిపి ఇస్తారు. విద్యార్థి ఏదో ఒక వృత్తి విద్య‌ను త‌ప్ప‌ని స‌రిగా చేయాలి.
    Published by:Sharath Chandra
    First published: