ఇంజనీరింగ్ పాసైనవారికి ప్రతిష్టాత్మక సంస్థలో ఇంజనీరింగ్ ప్రొఫెషనల్‌గా స్థిరపడే అవకాశమిది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు డిసెంబర్ 15 చివరి తేదీ. మొత్తం 399 పోస్టుల్ని భర్తీ చేయనుంది. వాస్తవానికి గతంలో 142 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల్ని ప్రకటించింది సెయిల్. ఇప్పుడు ఆ పోస్టుల్ని 399 సంఖ్యకు పెంచింది. గేట్ 2019 స్కోర్ ద్వారా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ లాంటి విభాగాల్లో వీరిని నియమించనుంది. గేట్ 2019 స్కోర్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 15
విద్యార్హత- మెకానికల్, కెమికల్, మెటాల్లర్జికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మైనింగ్ లాంటి ఇంజనీరింగ్ విభాగాల్లో 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. గేట్ 2019 స్కోర్ ఉండాలి.
సెయిల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.