స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 15గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని నోటిఫికేషన్ లో తెలిపారు. దాని కోసం ఇక్కడ www.sailcareers.com క్లిక్ చేయండి.
ఖాళీ వివరాలు
ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలిలా..
-కన్సల్టెంట్ - 10 పోస్టులు
-మెడికల్ ఆఫీసర్ - 10 పోస్టులు
-మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్) - 3 పోస్టులు
-అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ) - 4 పోస్టులు
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
-ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ - 87 పోస్టులు
-మైనింగ్ ఫోర్‌మెన్ - 9 పోస్టులు
-సర్వేయర్ - 6 పోస్టులు
-మైనింగ్ మేట్ - 20 పోస్టులు
-అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ - 34 పోస్టులు
-మైనింగ్ సర్దార్ - 50 పోస్టులు
-అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ - 8 పోస్టులు
ఫీజు ఎంత ఉంటుంది
ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు కూడా ఖాళలను బట్టి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ (E-3 & E-1) కోసం దరఖాస్తు ఫీజు రూ.700. గ్రేడ్ ఎస్-3 పోస్టులకు ఫీజు రూ.500. మరోవైపు గ్రేడ్ ఎస్-1 పోస్టులకు ఫీజు రూ.300గా నిర్ణయించారు.
విద్యార్హత..
ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి.. విద్యార్హత నుండి వయోపరిమితి వరకు అన్నీ పోస్టులకు భిన్నంగా ఉంటాయి. బీటెక్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో.. వివిధ స్ట్రీమ్ లో కోర్సులు పూర్తి చేసి ఉండాలి. పూర్తి నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి.
దరఖాస్తు విధానం..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
-తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ ఇవ్వండి.
-దానిలో పేర్కొన్న వివరాలను నమోదు చేయండి.
-తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి
-దీనిలో విద్యార్హత వివరాలతో పాటు.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయండి. తర్వాత సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
-తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS, SAIL