హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Attendant Cum Technician Posts: అటెండెంట్-కమ్-టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ఇలా..

Attendant Cum Technician Posts: అటెండెంట్-కమ్-టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) అటెండెంట్-కమ్-టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SAIL యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) అటెండెంట్-కమ్-టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు SAIL యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఈ కింద తెలిపిన లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఆ లింక్ ఇదే https://sail.co.in/en/home. అలాగే.. ఈ లింక్ ద్వారా SAIL రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ PDF అంతే కాకుండా.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 146 పోస్టులు భర్తీ చేయబడతాయి. అర్హత, పోస్టుల వివరాలు, జీతం తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


Job Notification: పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 1901 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..


ముఖ్యమైన తేదీలు..


దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 25 ఆగస్టు


దరఖాస్తుకు చివరి తేదీ - 15 సెప్టెంబర్


ఖాళీ వివరాలు..


మొత్తం పోస్టుల సంఖ్య – 146వీటిలో జనరల్ కేటగిరీ కింద 56, ఎస్సీ కేటగిరి కింద 16, ఎస్టీ సీ కింద 35, ఎస్టీ బీ కింద 10, ఓబీసీ కేటగిరీ కింద 16, ఈడబ్ల్యూసీ కేటగిరీ కింద 13 పోస్టులను మంజూరు చేశారు. ఈఎస్ ఎం కేటగిరీలో 21, పీడబ్ల్యూడీ కేటగిరీ కింద మొత్తం 13 పోస్టులను కేటాయించారు.


అర్హత ప్రమాణాలు..
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ కూడా ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వీటితో పాటు.. పిజికల్ మీజరమెంట్స్ కూడా ఉండాలి. పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 155 సెం.మీ, అమ్మాయిలు అయితే 143 సెం. మీ లకు తగ్గకూడదు.


పురుషుల యొక్క బరువు 45 కిలోలు, స్త్రీల బరువు 35 కిలోలకు తగ్గకూడదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


వయోపరిమితి..

అభ్యర్థి వయస్సు పరిమితి 28 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.


Constable Last Minute Tips: అభ్యర్థులకు ముఖ్య సూచనలు.. వీటిని తప్పక పాటించండి..


దరఖాస్తు ఫీజు..

జనరల్, OBC మరియు EWS కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ. 200. అయితే SC/ST/PWD/ESM మరియు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.


ఎంపిక ప్రక్రియ..

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


దీనిలో మొత్తం 100 మార్కులు ఉంటాయి. ప్రతీ 4 తప్పు సమాధానాలకు 0.25 మార్కులు కట్ చేస్తారు.


జనరల్ అవేర్ నెస్ లో 40 మార్కులు, రీజనింగ్ కు 30, మ్యాథ్స్ కు 30 మార్కులు ఉంటాయి.


దరఖాస్తు ప్రక్రియ ఇలా..


-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయాలి.


-పైన కనిపిస్తున్న కెరీర్ అనే కేటగిరీని ఎంచుకోవాలి.


-తర్వాత దీనిలో అటెండెంట్-కమ్-టెక్నీషియన్ ట్రైనీ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ను సబ్ మిట్ చేయాలి.


-భవిష్యత్ అవసరాల కొరకు దరాకాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి.


-దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, SAIL

ఉత్తమ కథలు