STATE BANK OF INDIA TO PUNJAB NATIONAL BANK TOTAL 41177 POSTS VACANT IN THESE 12 PUBLIC SECTOR PSU BANKS SS
Govt Bank Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్... ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 ఖాళీలు
Govt Bank Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్... ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)
Govt Bank Jobs 2022 | బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంక్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకింగ్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? అయితే అలర్ట్. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 40,000 పైగా ఖాళీలు (Bank Jobs) ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (Govt Bank Jobs) ఆఫీసర్లు, క్లర్క్స్, సబ్ ఆర్డినేట్ సిబ్బంది పోస్టులు 40,000 పైనే ఖాళీలు ఉన్నాయి. ఇటీవల పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. 2021 డిసెంబర్ 1 నాటికి పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు 8,05,986 పోస్టుల్ని (Bank Jobs) మంజూరు చేస్తే వాటిలో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ 2017 తర్వాత బ్యాంకుల్ని విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న ఖాళీల వివరాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Govt Bank Jobs 2022: ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీల వివరాలు ఇవే...
ఈ నివేదిక ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఖాళీలు కనిపిస్తున్నాయి. ఆఫీసర్, లోయర్ లెవెల్ ఆఫీసర్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. క్లర్క్ పోస్టులు 5,121 ఉండగా, ఆఫీసర్ల పోస్టులు 3,423 ఉన్నాయి. ఇక ఎస్బీఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాళీల విషయంలో రెండో స్థానంలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1210 ఆఫీసర్ పోస్టులు, 716 క్లర్క్ పోస్టులు ఉంటే 4817 సబ్ ఆర్డినేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానంలో ఉంది. ఈ బ్యాంకులో 3528 ఆఫీసర్ పోస్టులు, 1726 క్లర్క్ పోస్టులు, 1041 సబ్ ఆర్డినేట్ పోస్టులున్నాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడాలో అతి తక్కువ ఖాళీలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 190 పోస్టులు ఉంటే, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 15 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంది. మరిన్ని వివరాల కోసం ఈ కింద ఉన్న వెబ్సైట్స్ ఫాలో కావాలి.
బ్యాంకింగ్ రంగంలో పనిచేసే అనుపమ్ త్రివేదీ వెల్లడించి వివరాల ప్రకారం బ్యాంకుల్లో సబ్ ఆర్డినేట్ సిబ్బంది ఉద్యోగాలకు టెన్త్ పాస్ అయితే చాలు. వారికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. వేతనం రూ.10,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుంది. ఇక ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు రూ.30,000 నుంచి రూ.35,000 వేతనం ఉంటుంది. క్లర్క్ ఉద్యోగాలకు రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.