SBI Jobs: రేపటి నుంచి ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్... అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండిలా

SBI Junior Associate Admit Cards 2020 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దేశవ్యాప్తంగా 7870 జూనియర్ అసోసియేట్ లేదా క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదలయ్యాయి.

news18-telugu
Updated: February 21, 2020, 9:56 AM IST
SBI Jobs: రేపటి నుంచి ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్... అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండిలా
SBI Jobs: రేపటి నుంచి ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్... అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండిలా
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్)  పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 22న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 22, 29, మార్చి 1, 8వ తేదీల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ ఓపెన్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలి. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడానికి మార్చి 8 చివరి తేదీ. ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు వెళ్లేముందు ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. పరీక్షకు వెళ్లే సమయంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ లాంటి ఫోటో ఉన్న ఐడెంటిటీ కార్డ్ తీసుకెళ్లాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారు మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

SBI Junior Associate Admit Cards 2020: అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా...


ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షల అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా https://sbi.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

కుడివైపు టాప్‌లో Careers సెక్షన్ ఓపెన్ చేయండి.
అందులో జూనియర్ అసోసియేట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పేజీ ఓపెన్ చేయండి.
Preliminary Examination Call Letter లింక్ పైన క్లిక్ చేయాలి.


కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.లాగిన్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
హాల్ టికెట్ నేరుగా డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

దేశవ్యాప్తంగా 7870 జూనియర్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. హైదరాబాద్ పరిధిలో 375 పోస్టుల్ని నియమించబోతోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా వీరిని నియమించనుంది. ప్రస్తుతం ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ విడుదల కానున్నాయి. ఈ పరీక్షల్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS నిర్వహిస్తోంది. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు