నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకు జాబ్ కోరుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ ఏడాదిలోనే 14,000 పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. కాస్ట్ కటింగ్లో భాగంగా 30,000 మంది ఉద్యోగులను వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా పంపిస్తారన్న వార్తల్ని ఖండించింది ఎస్బీఐ. తమ బ్యాంకు ఎంప్లాయ్ ఫ్రెండ్లీ అని, కార్యకలాపాలను విస్తరించడానికి మరికొంత మంది అవసరం అవుతారని, ఈ ఏడాదిలో మరో 14,000 మందిని నియమించుకునే అలోచనలో ఉన్నామని ఎస్బీఐ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. క్లరికల్తో పాటు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని కూడా భర్తీ చేస్తోంది. త్వరలో మరో 14,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించింది. మరి వీటిలో ఏ పోస్టులు ఉంటాయో చూడాలి.
Anganwadi Jobs: రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే
NVS Recruitment 2020: నవోదయ విద్యాలయ సమితిలో 454 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
ఇక వీఆర్ఎస్కు సంబంధించిన డ్రాఫ్ట్ స్కీమ్ సిద్ధంగా ఉందని, బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. ఎస్బీఐలో గతేడాది 2.57 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఈ ఏడాది మార్చిలో 2.49 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్ ట్యాప్ వీఆర్ఎస్ 2020 పేరుతో ప్రతిపాదన సిద్ధమైంది. బ్యాంకు ఖర్చుల్ని తగ్గించుకోవడం, మానవ వనరుల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం 2017లో ఎస్బీఐ 5 అనుబంధ బ్యాంకుల్ని కలిపి ఒకే బ్యాంకుగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పుడు కొందరు ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించారు. ఇప్పుడే కాదు 2001లో కూడా ఎస్బీఐ వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించింది. త్వరలో వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటిస్తుందని, 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తారన్నది తాజా వార్తల సారాంశం.
Published by:Santhosh Kumar S
First published:September 08, 2020, 12:11 IST