STATE BANK OF INDIA OFFERS EDUCATION LOAN FOR PURSUING HIGHER EDUCATION IN INDIA OR ABROAD KNOW HOW TO APPLY SS
SBI Loan: ఎస్బీఐలో ఎడ్యుకేషన్ లోన్... ఇలా తీసుకోవచ్చు
SBI Loan: ఎస్బీఐలో ఎడ్యుకేషన్ లోన్... ఇలా తీసుకోవచ్చు
State Bank of India Education loan Scheme | భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి రుణాలు ఇస్తోంది ఎస్బీఐ. ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
ఈ రోజుల్లో ఉన్నత చదువులు చదవడమంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరమయ్యేవాళ్లెందరో. ఇలాంటివారిని ఆర్థికంగా ఆదుకుంటాయి ఎడ్యుకేషన్ లోన్స్. విద్యా రుణాలు తీసుకొని ప్రతిష్టాత్మక కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చాలామందే ఉన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే కాదు, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా విద్యార్థుల కోసం ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి రుణాలు ఇస్తోంది ఎస్బీఐ. ఎస్బీఐ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
భారతదేశంలో ఉన్నత విద్య కోసం గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలంటే రూ.20 లక్షల వరకు లోన్ ఇస్తుంది బ్యాంకు. కోర్సు పూర్తి చేసుకున్న 15 ఏళ్ల తర్వాత వరకు లోన్ తిరిగి చెల్లించొచ్చు. ఎడ్యుకేషన్ లోన్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, విదేశాల్లో చదవాలనుకుంటే పాస్ పోర్ట్, టెన్త్, ఇంటర్ అకడెమిక్ రికార్డ్, గ్రాడ్యుయేషన్ రిజల్ట్, CAT, CMAT, JEE, NEET, CET, GMAT, GRE, TOEFL లాంటి ఎంట్రెన్స్ పరీక్షల రిజల్ట్, విద్యాసంస్థ ఇచ్చే ఆఫర్ లెటర్ తప్పనిసరిగా బ్యాంకుకు సబ్మిట్ చేయాలి. దాంతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలి. గతంలో ఏవైనా రుణాలు ఉంటే వెల్లడించాలి. కో-అప్లికెంట్ ఉంటే ఐడీప్రూఫ్, ఐడ్రస్ ప్రూఫ్, గతంలో తీసుకున్న రుణాల వివరాలు ఇవ్వాలి. కో-అప్లికెంట్ ఆదాయ వివరాలు వెల్లడించాలి. ఎస్బీఐలో ఎడ్యుకేషన్ లోన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Photos: స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ వేషాల్లో ఎన్నికల సిబ్బంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.