SBI Fellowship: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్

SBI Youth for India Fellowship | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 'ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్' అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 26, 2020, 6:57 PM IST
SBI Fellowship: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్
SBI Fellowship: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు డిగ్రీ పాసయ్యారా? గ్రామీణ భారతంపై అధ్యయనం చేద్దామనుకుంటున్నారా? మీలాంటి వారికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. 'ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్' ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఈ ఫెలోషిప్‍కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైనవారు గ్రామీణాభివృద్ధిపై 13 నెలల ప్రోగ్రామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్ కాలంలో అంకితభావంతో పనిచేయాలి. వారంతా గ్రామాల్లోకి వెళ్లి అక్కడి సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేయాలి. వారికి ప్రముఖ ఎన్‌జీఓల ప్రతినిధులు, నిపుణులు సహకారం అందిస్తారు. అభ్యర్థులకు గ్రామీణ భారతంలోని సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల అంకితభావం, ఆసక్తి, అభిరుచి ఉండాలి. భిన్న సంస్కృతులను నేర్చుకోవడంపై ఆసక్తి ఉండాలి.


SBI Youth for India Fellowship: ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ వివరాలివే...




ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కాలవ్యవధి- 13 నెలలుఅర్హతలు- 2020 ఆగస్ట్‌ నాటికి డిగ్రీ పాస్ కావాలి. విద్యార్థులు, ఉద్యోగులు ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 21 నుంచి 32 ఏళ్లు
ఎంపిక విధానం- వేర్వేరు నేపథ్యం, వృత్తి, వ్యక్తిగత అంశాలను పరిగణలోకి తీసుకొని ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తారు.
అధ్యయనం చేయాల్సిన అంశాలు- విద్య, మహిళా సాధికారత, నీటి వనరులు, సాంప్రదాయ కళలు, టెక్నాలజీ, సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్, గ్రామీణ జీవితం, స్వయం పరిపాలన, ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు.

ఇప్పటికే ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్‌ను 300 మందికి పైగా అభ్యర్థులు పూర్తి చేశారు. వీరిలో 70 శాతం మంది గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. దేశంలోని 99 మారుమూల గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు. సుమారు 10 ఎన్‌జీఓలు వీరికి సహకారం అందిస్తున్నాయి. మరి మీకు కూడా ఈ ఫెలోషిప్‌పై ఆసక్తి ఉంటే https://register.you4.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి. పూర్తి వివరాల కోసం https://youthforindia.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Free Courses: ఆన్‌లైన్‌లో ఈ 7 కోర్సులు ఫ్రీ... ఖాళీ సమయంలో పూర్తి చేయండి

SWAYAM: ఇంట్లో బోర్ కొడుతుందా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోర్సులు చేయండి ఇలా

DIKSHA App: విద్యార్థులకు ఇంట్లోనే పాఠాలు... ఈ యాప్‌తో సాధ్యం
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు