హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 క్లర్క్ జాబ్స్... అప్లై చేయండి ఇలా

SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 క్లర్క్ జాబ్స్... అప్లై చేయండి ఇలా

SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 క్లర్క్ జాబ్స్... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 క్లర్క్ జాబ్స్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Junior Associate Recruitment 2021 | ఎస్‌బీఐలో 5454 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో 5454 ఖాళీలను భర్తీ చేస్తోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 275 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 మే 17 చివరి తేదీ. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయినవారు లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్స్ అయిన https://www.sbi.co.in/web/careers లేదా https://bank.sbi/web/careers లలో అప్లై చేయాలి. ఒక అభ్యర్థి ఒక రాష్ట్రంలో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

FSSAI Recruitment 2021: ఫుడ్ సేఫ్టీ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 5 రోజులే గడువు

SBI Junior Associate Recruitment 2021: దరఖాస్తు విధానం ఇదే...


అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/web/careers లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

'Latest Announcements' ట్యాబ్ పైన క్లిక్ చేస్తే 'Recruitment of Junior Associates (Customer support & Sales)' నోటిఫికేషన్ కనిపిస్తుంది.

అందులో Advertisement పైన క్లిక్ చేస్తే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది.

నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు 'Apply Online' పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

కొత్త పేజీలో 'Click Here for New Registration' పైన క్లిక్ చేయాలి.

మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

మీకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి. వాటిని గుర్తుంచుకోవాలి. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌కు ఈ వివరాలు వస్తాయి.

ఆ తర్వాత స్టెప్‌లో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

మీ ఫోటో, సంతకం, ఎడమచేతి బొటన వేలిముద్ర, డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఫీజు చెల్లించిన తర్వాత చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Teacher Jobs: ఏకలవ్య స్కూళ్లలో 3479 టీచర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

IIT Jobs 2021: ఐఐటీ రూర్కీలో 139 జాబ్స్... రేపే చివరి తేదీ

2021 మే 17 లోగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. జూన్‌లో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదలౌతాయి. జూలైలో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలౌతాయి. మెయిన్స్ అడ్మిట్ కార్డుల జూలైలో విడుదలౌతాయి. 2021 జూలై 31న మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

First published:

Tags: Bank Jobs 2021, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Sbi, State bank of india, Upcoming jobs

ఉత్తమ కథలు