స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 5454 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు 2021 మే 17 లోగా దరఖాస్తు చేయాలి. దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ బ్రాంచ్‌లల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఎస్బీఐ. డిగ్రీ పాస్ అయినవారు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.sbi.co.in/web/careers లేదా https://bank.sbi/web/careers వెబ్సైట్లలో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు ఎస్బీఐ ఎలా ఎంపిక చేస్తుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటీ? సిలబస్ ఏంటీ? ఏఏ టాపిక్స్‌పై ప్రశ్నలు అడుగుతారు? అన్న సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. మరి 5454 క్లర్క్ పోస్టుల భర్తీకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.
LIC Agent Jobs: ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరాలనుకుంటున్నారా? అప్లై చేయండి ఇలా
SBI Clerk Jobs 2021: ఎస్బీఐలో 5454 క్లర్క్ జాబ్స్... అప్లై చేయండి ఇలా
ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేయనుంది ఎస్బీఐ. ప్రిలిమ్స్ పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో 100 ఆబ్జెక్టీవ్ ప్రశ్నలుంటాయి. 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు మాత్రమే. 3 సెక్షన్లకు సంబంధించి 20 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. ప్రతీ సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. తప్పుగా రాసిన ప్రతీ సమాధానానికి 0.25 మార్కుల్ని తగ్గిస్తారు. ఉన్న పోస్టుల కంటే 10 రెట్లు అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.ప్రస్తుతం 5454 పోస్టుల్ని భర్తీ చేస్తోంది కాబట్టి 54,540 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
Jagananna Fellowship: విద్యార్థులకు నెలకు రూ.25,000 జగనన్న ఫెలోషిప్... అప్లై చేయండి ఇలా
Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు... భర్తీ చేసే పోస్టులు ఇవే
ఇక ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. మెయిన్స్‌లో 190 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు. జనరల్ / ఫైనాన్స్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. జనరల్ / ఫైనాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్‌కు 35 నిమిషాల చొప్పున, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్కు 45 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ మినహా అన్ని ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. 1/4 నెగిటీవ్ మార్క్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారిన ఫైనల్ సెలక్షన్‌కు ఎంపిక చేస్తారు. వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs 2021, Banking, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Sbi, State bank of india, Telangana jobs, Upcoming jobs