స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను నేటి(డిసెంబర్ 9) నుంచి ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 29, 2022 వరకు sbi.co.in అనే వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. వీటిలో డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరి 2023 నెలలో నిర్వహించబడుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద మొత్తం 02 పోస్టులను భర్తీ చేయన్నారు.
అర్హతలు..
ఏదైనా డిగ్రీ తో పాటు.. పని అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
వయోపరిమితి.. డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 40 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అసిస్టెంట్ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
State Bank of India is recruiting Specialist Cadre Officers on a contractual basis with proficient knowledge in data protection. To apply, visit: https://t.co/TquwQ1r5rS#JoinSBIFamily #SBI #StateBankofIndia #AmritMahotsav pic.twitter.com/mFJ3l9vPrG
— State Bank of India (@TheOfficialSBI) December 9, 2022
దరఖాస్తు విధానం ఇలా..
Step 1 : అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2 : ఇప్పుడు హోం పేజీలో కనిపిస్తున్నలేటెస్ట్ అనౌన్స్ మెంట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3 : దీనిలో స్కోల్ అవుతున్న మూడో ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 4 : అక్కడ ఇచ్చిన సూచనలు చదివి.. మీ యొక్క అర్హతను నిర్ధారించుకొని.. ఆన్ లైన్విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
Step 5 : చివరగా.. వెబ్ సైట్ టాప్ లో కనిపిస్తున్న జాయిన్ ఎస్బీఐ ఆప్షన్ ను ఎంచుకొని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం డైరెక్ట్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
వీటితో పాటు.. డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్బీఐ. ఈ నోటిఫికేషన్ ద్వారా 36 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ క్రెడిట్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు కూడా మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థి యొక్క వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2022, JOBS, Sbi