హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Startups: స్టార్టప్స్ కోసం కొత్త సేవలు.. MAARG పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్టార్టప్ అప్లికేషన్స్ లాంచ్..

Startups: స్టార్టప్స్ కోసం కొత్త సేవలు.. MAARG పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్టార్టప్ అప్లికేషన్స్ లాంచ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డిపార్ట్‌మెంట్‌ ఫర్ ప్రమోషన్ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ట్రేడ్ (DPIIT).. స్టార్టప్ ఇండియాకు కొత్తగా ఓ పిలుపునిచ్చింది. నేషనల్ మెంటర్‌షిప్ ప్లాట్‌ఫామ్‌ అయిన MAARG పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్టార్టప్స్‌ అప్లికేషన్‌లు పెట్టుకోవాలని తెలియజేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారత్‌లో ఇప్పుడు స్టార్టప్‌ల ఎరా నడుస్తోంది. కొత్త కొత్త ఐడియాలతో యువత కంపెనీలు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తోంది. ఓ వైపు వారికి ఆర్థికంగా చేయూతనిస్తూనే మెంటార్షిప్‌ ప్రోగ్రాంలతో దిశా నిర్దేశం కూడా చేస్తోంది. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్ వ్యవస్థల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఈ వ్యవస్థను మన దేశంలో మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఫర్ ప్రమోషన్ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ట్రేడ్ (DPIIT).. స్టార్టప్ ఇండియాకు కొత్తగా ఓ పిలుపునిచ్చింది. నేషనల్ మెంటర్‌షిప్ ప్లాట్‌ఫామ్‌ అయిన MAARG పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్టార్టప్స్‌ అప్లికేషన్‌లు పెట్టుకోవాలని తెలియజేసింది.

ఇలాంటి చర్యల ద్వారా ఇండియాలో స్టార్టప్‌ ఎకో సిస్టం మరింత బలోపేతం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు స్టార్టప్‌లను ఎంతో బూస్ట్‌ చేస్తాయని తెలిపారు. ఇలాంటి వాటి వల్ల కొత్త ఇన్నోవేషన్స్‌ పుట్టుకొస్తాయని, అవి భారత కంపెనీల స్టార్టప్ కల్చర్‌ని ప్రోత్సహిస్తాయని వెల్లడించారు.

అసలు ఏమిటీ మార్గ్‌?

MAARG పోర్టల్ స్టార్టప్‌ల అవసరాలు అన్నింటికీ వన్‌స్టాప్‌ ప్లాట్‌పామ్‌. దీని ద్వారా వాటికి కావాల్సిన మెంటర్‌షిప్, అసిస్టెన్స్ లభిస్తాయి. స్టార్టప్‌ ప్రస్తుత స్థితి, దాని బ్యాగ్రౌండ్‌, ఏ ప్రాంతంలో ఉంది లాంటి విషయాల ఆధారంగా దానికిచ్చే మెంటార్‌షిప్ ఉంటుంది. స్టార్టప్‌లకు కావాల్సిన సలహాలు, స్థిరంగా అవి వృద్ధిని సాధించేందకు కావాల్సిన చర్యలు అన్నింటిపైనా దృష్టి పెడతారు.

MAARG పోర్టల్ ఆపరేషన్స్ మూడు దశల్లో అమలు చేస్తున్నారు. ఫేజ్-1లో మెంటార్ ఆన్‌బోర్డింగ్ ఉంటుంది. 400 కంటే ఎక్కువ విజయవంతమైన నిపుణులైన మెంటార్స్ వివిధ సెక్టార్ల కోసం ఆన్‌బోర్డ్‌లో ఉన్నారు. ఫేజ్-2లో స్టార్టప్ ఆన్‌బోర్డింగ్ చేపడతారు. ఇందులో భాగంగా DPIIT MAARG పోర్టల్‌లో స్టార్టప్‌ల ఆన్‌బోర్డింగ్‌ను 14 నవంబర్ 2022 నుంచి ప్రారంభిస్తోంది. ఫేజ్-3లో MAARG పోర్టల్ లాంచ్, మెంటర్ మ్యాచ్ మేకింగ్‌పై దృష్టి సారిస్తారు.

ఈ పోర్టల్‌ మొబైల్‌ ఫ్రెండ్‌లీ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌తో పని చేస్తుంది. వీడియో, ఆడియో కాల్‌ ఆప్షన్లతో ఉంటుంది. స్టార్టప్‌లు తమ అవసరాలకు అనుగుణంగా మెంటార్‌షిప్‌ ప్రోగ్రాంలను ఇందులో తీసుకుని వీలుంటుంది. వారి అసవరాలకు అనుగుణంగా కస్టమైజబుల్‌ మెంటార్‌షిప్‌ ప్రోగ్రాంలూ ఇందులో ఉంటాయి. ఈ అన్ని చర్యల ద్వారా స్టార్టప్‌ ఎకోసిస్టం బలోపేతం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది.

దశల వారీగా గైడెన్స్

స్టార్టప్‌లు సాధారణంగా వివిధ రంగాలకు సంబంధించినవై ఉంటాయి. అన్నింటికీ కలిపి ఒకే రకమైన మెంటార్షిప్‌ ప్రోంగ్రాంలు ఇస్తే వాటికి అంత ఉపయోగకరంగా ఉండవు. ఈ విషయంపైనే MAARG పోర్టల్ ప్రధానంగా దృష్టి సారించింది. సెక్టార్ ఫోకస్డ్ గా వారికి గైడెన్స్ ప్రొవైడ్ చేయాలని లక్ష్యంగా చేసుకుంది. దాని లైఫ్‌సైకిల్‌ ఆధారంగా దశల వారీగా గైడెన్స్‌ ఇవ్వాలని చూస్తోంది. మెంటార్‌, మెంటీల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది.

నిపుణుల మార్గదర్శకత్వాన్ని స్టార్టప్‌లకు తేలికగా అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఔట్‌కమ్‌ ఓరియంటెడ్‌ మెకానిజంని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దాన్ని ట్రాక్‌ చేసి స్టార్టప్‌ల సక్సెస్‌ను చూడాలని భావిస్తోంది. స్టార్టప్‌లు దీని ద్వారా ఎకడమీషియన్లు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లతో కనెక్ట్‌ అవ్వగలుగుతాయి. స్టార్టప్‌ ఫౌండర్లు అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్టర్లను కనుగొనగలుగుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: JOBS, Private Jobs, Startups