SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాశారా? రిజల్ట్స్ చెక్ చేయండిలా

SSC Selection Posts Examination Phase VII result 2019 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. గతేడాది నిర్వహించిన సెలెక్షన్ పోస్ట్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 7 ఫలితాలు విడుదల కానున్నాయి.

news18-telugu
Updated: February 18, 2020, 4:33 PM IST
SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాశారా? రిజల్ట్స్ చెక్ చేయండిలా
SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాశారా? రిజల్ట్స్ చెక్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు గతేడాది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఎగ్జామ్ రాశారా? ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కాసేపట్లో ఫలితాలు విడుదల కానున్నాయి. సెలెక్షన్ పోస్ట్స్ ఫేజ్ 7 పరీక్షా ఫలితాలను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ ఫలితాలు ఫిబ్రవరి 17న విడుదల కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఫలితాలు విడుదల చేయలేకపోతున్నామని, 2020 ఫిబ్రవరి 18న రిజల్ట్స్ విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 18 రాత్రి లోగా రిజల్ట్స్ విడుదల కానున్నాయి. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో సెలెక్షన్ పోస్ట్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 7 పరీక్షలు జరిగాయి. మరి ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

SSC Selection Posts Examination Phase VII result 2019: ఫలితాలు చెక్ చేయండి ఇలా...


ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ ఓపెన్ చేయండి.

మీకు హోమ్ పేజీలోనే 'SSC Phase VII result 2019' ఫలితాల లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
SSC Phase VII result 2019 ఫలితాలు కనిపిస్తాయి.


ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.ఫలితాల కాపీని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

Axis Bank Jobs: ఈ కోర్సు పాసైతే యాక్సిస్ బ్యాంకులో జాబ్ గ్యారెంటీ

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 317 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ అర్హత
First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు