SSC Recruitment: 1000 ఉద్యోగాలు భర్తీ చేయనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... వివరాలివే

SSC MTS Recruitment 2019 | ఏప్రిల్ 22న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో నోటిఫికేషన్ చూడొచ్చు. పరీక్షా ప్యాటర్న్, సిలబస్, కొత్త నోటిఫికేషన్ షెడ్యూల్ లాంటి వివరాలను తెలుసుకోండి.

news18-telugu
Updated: April 19, 2019, 6:01 PM IST
SSC Recruitment: 1000 ఉద్యోగాలు భర్తీ చేయనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... వివరాలివే
SSC Recruitment: 1000 ఉద్యోగాలు భర్తీ చేయనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... వివరాలివే
news18-telugu
Updated: April 19, 2019, 6:01 PM IST
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. అధికారిక నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల కానుంది. మొత్తం 1000 పోస్టుల్ని భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 22న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in లో నోటిఫికేషన్ చూడొచ్చు. గతంలో కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామక ప్రక్రియ చేపట్టింది ఎస్ఎస్‌సీ. అప్పుడు నిర్వహించిన పరీక్షా విధానం, సిలబస్, కొత్త నోటిఫికేషన్ షెడ్యూల్ లాంటి వివరాలను తెలుసుకోండి.

Read this: Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

SSC MTS 2019: పరీక్ష షెడ్యూల్ (అంచనా)



నోటిఫికేషన్ రిలీజ్: 2019 ఏప్రిల్ 22
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 మే 22


అడ్మిట్ కార్డ్ రిలీజ్: పరీక్షకు 3 వారాల ముందు
రాత పరీక్ష-పేపర్ 1: ఆగస్ట్ 2 నుంచి సెప్టెంబర్ 6
పేపర్ 1 ఫలితాల ప్రకటన: సెప్టెంబర్ చివరి వారం
రాత పరీక్ష-పేపర్ 2: నవంబర్ 17
ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2019

Read this: Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు ఇవే...

SSC MTS 2019: పరీక్షా విధానం


పేపర్-1, పేపర్-2 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పేపర్-1 లో రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 నెగిటీవ్ మార్క్ ఉంటుంది. మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పేపర్-1 పరీక్షా సమయం 120 నిమిషాలు. పేపర్-2లో డిస్క్రిప్టీవ్ విధానంలో ఉంటుంది. ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ ఉంటాయి. పరీక్షా సమయం రెండున్నర గంటలు.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు

ఇవి కూడా చదవండి:

IRCTC: రైల్వే కౌంటర్‌లో కొన్న టికెట్ ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయడానికి 10 స్టెప్స్

SBI Card: ఎస్‌బీఐ కార్డు ఉంటే ఉచితంగా ఇన్స్యూరెన్స్... వివరాలివే

NIOS Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో 90 ఉద్యోగాలు
First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...