SSC Jobs: గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడంటే

Staff Selection Commission Recruitment 2020 | కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదాపడ్డ జాబ్ నోటిఫికేషన్లపై దృష్టిపెట్టింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. త్వరలో పరీక్షలు నిర్వహించనుంది.

news18-telugu
Updated: June 2, 2020, 1:47 PM IST
SSC Jobs: గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడంటే
SSC Jobs: గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు, చేయాలనుకునేవారికి శుభవార్త. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడ్డ పరీక్షల్ని త్వరలో నిర్వహించనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయనుంది. మొత్తం 7 నోటిఫికేషన్లకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. అందులో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ, జూనియర్ ఇంజనీర్, సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ లాంటివి ఉన్నాయి. ఈ పరీక్షలన్నీ ఇప్పటికే పూర్తవ్వాల్సింది. కానీ కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ షెడ్యూల్ విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ ఫాలో అవుతుండాలి. మరి ఏ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకోండి.

Staff Selection Commission Exam Dates: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు



కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2019 (టైర్ 1)- ఆగస్ట్ 17 నుంచి 21, ఆగస్ట్ 24 నుంచి 27
జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) ఎగ్జామినేషన్,2019 (పేపర్ 2)- 2020 సెప్టెంబర్ 1 నుంచి 4
సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ 2020 ఫేజ్ VIII- సెప్టెంబర్ 7 నుంచి 9
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్ 2019- సెప్టెంబర్ 10 నుంచి 12
సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ (పేపర్ 1)- 2020- సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1, అక్టోబర్ 5జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రాధ్యాపక్ ఎగ్జామినేషన్ (పేపర్ 1)- 2020- అక్టోబర్ 6
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2019 (టైర్ 2)- అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్‌లో 2167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

Bank Jobs: త్వరలో ఐబీపీఎస్ నోటిఫికేషన్... భర్తీ చేసే పోస్టులు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 2, 2020, 1:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading