జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-JHT, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్ ఎగ్జామినేషన్ లాంటి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి సెప్టెంబర్ 26 చివరి తేదీ. మొత్తం ఎన్ని ఖాళీలను భర్తీ చేయనుందన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. ఖాళీల వివరాలను https://ssc.nic.in వెబ్సైట్‌లో Candidates Corner సెక్షన్‌లో Tentative Vacancy సెక్షన్‌లో అప్‌డేట్ చేస్తుంది ఎస్ఎస్‌సీ. రెండు దశల రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పలు పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 27
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 26 సాయంత్రం 5 గంటలు
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 28 సాయంత్రం 5 గంటలు
ఆఫ్‌లైన్ చలాన్ జెనరేట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 28 సాయంత్రం 5 గంటలు
చలాన్ ద్వారా పేమెంట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30 బ్యాంకు వేళలు ముగిసే సరికి
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పేపర్-1) నిర్వహించే తేదీ: 2019 నవంబర్ 26
వయస్సు: 2020 జనవరి 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 64 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు... వివరాలివే
GSL Jobs: గోవా షిప్‌యార్డ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.