STAFF SELECTION COMMISSION SSC RELEASED 11271 TENTATIVE VACANCIES FOR COMBINED GRADUATE LEVEL EXAMINATION 2018 SS
SSC Jobs: ఒక్క నోటిఫికేషన్లో 11,271 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
SSC Jobs: ఒక్క నోటిఫికేషన్లో 11,271 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
(ప్రతీకాత్మక చిత్రం)
Staff Selection Commission Jobs | కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాలు, శాఖల్లో 11,271 భర్తీ చేయనుంది. వీటిలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్-CGDA విభాగంలో 3,082 పోస్టులు, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 1,729 అత్యధికంగా ఉన్నాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL 2018 పరీక్ష రాసినవారికి శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,271 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ప్రకటించింది. గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి ఖాళీలను వరుసగా ప్రకటిస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కొద్ది రోజుల క్రితం కొద్ది రోజుల క్రితమే 'ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్, సీఐఎస్ఎఫ్లో ఏఎస్ఐ ఎగ్జామినేషన్ 2018' నోటిఫికేషన్లో 1,578 ఎస్ఐ పోస్టుల్ని, 'సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ 2019' నోటిఫికేషన్లో 2475 పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL 2018 నోటిఫికేషన్లో 11,271 పోస్టుల్ని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాలు, శాఖల్లో 11,271 భర్తీ చేయనుంది. వీటిలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్-CGDA విభాగంలో 3,082 పోస్టులు, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 1,729 అత్యధికంగా ఉన్నాయి. మిగతా పోస్టులు ఇతర విభాగాల్లో ఉన్నాయి. ప్రస్తుతం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL 2018 నియామక ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబర్ 29న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన టియర్ 3 (మూడో దశ) పరీక్ష జరగనుంది. మొదటి, రెండో, మూడో దశ పరీక్షల మార్కుల ఆధారంగా చివరి మెరిట్ లిస్ట్ సిద్ధమవుతుంది. ఖాళీలను ప్రకటిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.