SSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్

SSC Recruitment 2019 | ఖాళీల వివరాలను https://ssc.nic.in వెబ్‌సైట్‌లోని Candidate’s Corner సెక్షన్‌లో Tentative Vacancy క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇందులో ఖాళీల వివరాలను అప్‌డేట్ చేస్తుంది ఎస్ఎస్‌సీ.

news18-telugu
Updated: October 4, 2019, 2:37 PM IST
SSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
SSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 4, 2019, 2:37 PM IST
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఓపెన్ కాంపిటీటీవ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారికి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. ఎన్ని ఖాళీలను భర్తీ చేయనుందో వెల్లడించలేదు స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఖాళీల వివరాలను https://ssc.nic.in వెబ్‌సైట్‌లోని Candidate’s Corner సెక్షన్‌లో Tentative Vacancy క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇందులో ఖాళీల వివరాలను అప్‌డేట్ చేస్తుంది ఎస్ఎస్‌సీ. స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SSC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటలు
ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2019 అక్టోబర్ 20 సాయంత్రం 5 గంటలు
చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2019 అక్టోబర్ 20 సాయంత్రం 5 గంటలు


చలానా చెల్లించడానికి చివరి తేదీ- 2019 అక్టోబర్ 22 బ్యాంకు వేళలు ముగిసేవరకు
Loading...
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2020 మే 5 నుంచి 2020 మే 7 వరకు
విద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ పోస్టుకు 18 నుంచి 30 ఏళ్ల లోపు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీ పోస్టుకు 18 నుంచి 27 ఏళ్ల లోపు.
ఫీజు- రూ.100.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం

Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 ఉద్యోగాలు... వారికి మాత్రమే

Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 132 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...