Police Jobs: డిగ్రీ అర్హతతో ఎస్సై, ఏఎస్ఐ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

SSC SI ASI Recruitment 2019 | ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హత. అయితే ఏఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించలేదు.

news18-telugu
Updated: October 14, 2019, 3:43 PM IST
Police Jobs: డిగ్రీ అర్హతతో ఎస్సై, ఏఎస్ఐ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Police Jobs: డిగ్రీ అర్హతతో ఎస్సై, ఏఎస్ఐ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 14, 2019, 3:43 PM IST
పోలీస్ ఉద్యోగం మీ కలా? పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? పోలీస్ జాబ్ సంపాదించాలని కసరత్తు చేస్తున్నారా? మీకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ), ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్- మేల్ / ఫీమేల్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హత. అయితే ఏఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించలేదు. https://ssc.nic.in వెబ్‌సైట్‌లో Candidates Corner సెక్షన్‌లో Tentative Vacancy ట్యాబ్‌ క్లిక్ చేసి త్వరలో ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. ఎస్సై, ఏఎస్సై పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Railway Jobs: రైల్వేలో 2590 అప్రెంటీస్ పోస్టులు... అర్హతలివే

SSC SI ASI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు



ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 17
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 16 సాయంత్రం 5 గంటలు


ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటలు
ఆఫ్‌లైన్ చలానా జెనరేట్ చేయడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటలు
Loading...
చలానా ద్వారా పేమెంట్ చేయడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 19 బ్యాంకు వేళలు ముగిసేవరకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (పేపర్-1): 2019 డిసెంబర్ 11 నుంచి 13 వరకు
పేపర్ 2 ఎగ్జామ్: తర్వాత వెల్లడించనున్న ఎస్ఎస్‌సీ
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ.
వయస్సు: 2020 జనవరి 1 నాటికి 20 నుంచి 25 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డిప్లొమా, బీటెక్ పాసయ్యారా? డీఆర్‌డీఓలో ఉద్యోగాలు

UPSC Jobs: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్... వివరాలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే
First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...