SSC Jobs: జేఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్... సెప్టెంబర్ 12 లాస్ట్ డేట్

SSC JE recruitment 2019 | ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను https://ssc.nic.in వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

news18-telugu
Updated: September 10, 2019, 6:06 PM IST
SSC Jobs: జేఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్... సెప్టెంబర్ 12 లాస్ట్ డేట్
SSC Jobs: జేఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్... సెప్టెంబర్ 12 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 10, 2019, 6:06 PM IST
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్-SSCజూనియర్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 12 చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు సంస్థలు, మంత్రిత్వ శాఖల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవి లెవెల్ 6 లో గ్రూప్ బీ(నాన్ గెజిటెడ్) పోస్టులు. వీరికి 7వ సెంట్రల్ పే కమిషన్ వర్తిస్తుంది. ఈ పోస్టుల భర్తీ కోసం కాంపిటీటీవ్ ఎగ్జామ్ SSC JE recruitment 2019 నిర్వహించనుంది. అయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేయనుందో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వెల్లడించలేదు. https://ssc.nic.in వెబ్‌సైట్‌లో Candidate‟s Corner సెక్షన్‌లో Tentative Vacancy లింక్‌లో ఖాళీలను త్వరలో వెల్లడిస్తుంది. గతేడాది మాత్రం 1601 పోస్టుల్ని భర్తీ చేసింది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను https://ssc.nic.in వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SSC JE recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 ఆగస్ట్ 13

దరఖాస్తు ప్రక్రియ ముగింపు: 2019 సెప్టెంబర్ 12
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు
ఆఫ్‌లైన్ చలానా జెనరేట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు


చలానా ద్వారా పేమెంట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 16 బ్యాంకు వేళలు ముగిసే వరకు
Loading...
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్-1, పేపర్-2: పరీక్ష తేదీ వెల్లడించాల్సి ఉంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రిలయెన్స్ ట్రెండ్స్‌ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

NABARD Jobs: నాబార్డ్‌లో 91 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు
First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...