• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • STAFF SELECTION COMMISSION SSC ANNOUNCED 8582 VACANCIES UNDER COMBINED GRADUATE LEVEL CGL 2019 EXAMINATION SS

SSC Jobs: 8582 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

SSC Jobs: 8582 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ప్రతీకాత్మక చిత్రం)

SSC CGL examination | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC 8582 ఖాళీలను ప్రకటించింది.

  • Share this:
    స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ 2019 రాసినవారికి శుభవార్త. ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు ఖాళీలను కూడా ప్రకటించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా 8582 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎస్ఎస్‌సీ సీజీఎల్ 2019 నోటిఫికేషన్ గతేడాది విడుదలైన సంగతి తెలిసిందే. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మార్చి 3 నుంచి 9 వరకు నిర్వహించింది. ఫలితాలు ఎప్పుడో విడుదల కావాల్సింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఫలితాల విడుదల ఆలస్యమైంది. జూలై 1న ఫలితాలను విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. రెండో దశ పరీక్షలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.

    IBPS RRB 2020: బ్యాంకు ఉద్యోగాల జాతర... 9640 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్

    Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే

    ఇక ఈ నోటిఫికేషన్‌లో 8582 పోస్టుల్ని ప్రకటించింది. ఇవి తాత్కాలికంగా ప్రకటించిన ఖాళీలు మాత్రమే. ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ప్రతీ ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ ఏడాది నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది.
    First published: