Home /News /jobs /

STAFF SELECTION COMMISSION RELEASED NOTIFICATION OF JUNIOR ENGINEER RECRUITMENT FOR THE B TECH CIVIL MECHANICAL AND ELECTRICAL COURSE ENGINEERS VB

SSC Recruitment 2022: బీటెక్ Civil, Mech, EEE అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎస్సెస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు క్వాంటిటీ సర్వేయింగ్ మరియు కాంట్రాక్ట్స్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Secunderabad, India
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు క్వాంటిటీ సర్వేయింగ్ మరియు కాంట్రాక్ట్స్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి అంటే ఆగస్టు 12 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2 సెప్టెంబర్ 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.  ఈ ప్రక్రియ ద్వారా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ వాటర్ కమీషన్ మరియు మిలిటరీ ఇంజనీర్ సర్వీస్‌తో సహా ఇతర విభాగాలలో సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ ట్రేడ్‌లో జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ అనేది రెండు దశల రాత పరీక్ష అండ్
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. ఈ రాత పరీక్ష నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

RRB Group D Update: ఆర్ఆర్బీ గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. అందుబాటులోకి హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా..


అర్హతలు..
అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి సడలింపు
వయస్సు పరిమితి 30 లేదా 32 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు . గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.



దరఖాస్తు చేసుకోండిలా.. 

Step 1: అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Step 2: హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ లింక్‌ ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 3: అవసరమైన పత్రాలు అనగా.. సిగ్నేచర్, ఫోటోలాంటివి అప్ లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Step 4: దరఖాస్తు రుసుము చెల్లించి.. అప్లికేషన్ ఫారమ్ ను సబ్ మిట్ చేయాలి.

Step 5: దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి. దానిని భవిష్యత్ అవసరాల కొరకు దాచుకోవాలి.

దరఖాస్తు రుసుము
జనరల్ అండ్ OBC అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు మరియు అన్ని తరగతుల మహిళలకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
పేపర్-I (CBT) అండ్ పేపర్-IIలో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పేపర్-2 పరీక్ష కొరకు అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. ఈ సీబీటీ పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. వీటికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పుకు .25 మార్కులను కోల్పోతారు.

జీతం..
జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు జీతం ఇవ్వబడుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: B tech, Career and Courses, Degree students, Engineers, JOBS, Staff Selection Commission

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు