హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో భారీ నోటిఫికేషన్.. డిగ్రీతో 990 పోస్టులు భర్తీ..

Jobs In SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో భారీ నోటిఫికేషన్.. డిగ్రీతో 990 పోస్టులు భర్తీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్ష ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. దీనిలో మెరిట్ మార్కులు సాధించిన వారిని ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) పలు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్ష ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. దీనిలో మెరిట్ మార్కులు(Merit Marks) సాధించిన వారిని ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కు(Notification) సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) పే మ్యాట్రిక్స్ లెవెల్ 6లో ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD)లో గ్రూప్ B పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించాలని ప్రకటించింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లోని సైంటిఫిక్ అసిస్టెంట్(Scientific Assistant) గ్రూప్-'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేస్తారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 990 పోస్టులను భర్తీ చేస్తారు. రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30, 2022న ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీ అక్టోబర్ 18, 2022 వరకు ఉంటుంది. దరఖాస్తుల సవరణకు అవకాశం 25.10.2022 ఉండగా.. రాత పరీక్ష డిసెంబరు, 2022 న నిర్వహిస్తారు.

సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (భౌతికశాస్త్రం సబ్జెక్ట్‌లో ఒకటిగా)/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా.. గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమానం. ఇంటర్‌లో మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.

TSPSC Halltickets: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు.. వివరాలిలా..

వయోపరిమితి :

18-10-2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అభ్యర్థి తప్పనిసరిగా 19-10-1992 కంటే ముందుగా మరియు 17-10-2004 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు..

చెల్లించవలసిన దరఖాస్తు ఫీజు.. రూ. 100. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ దివ్యాంగులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM)కి చెందిన మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

ఎంపిక విధానం:

రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రెండు గంటల పాటు 200 మార్కులతో కూడిన 200 ప్రశ్నలతో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్షను కమిషన్ నిర్వహిస్తుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

ఈ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు , కాకినాడ, కర్నూలు, నెల్లూరు , రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ , విశాఖపట్నం , హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో నిర్వహిస్తారు.

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు .. 110 పోస్టులు ఖాళీ..

ఎలా దరఖాస్తు చేయాలి..

-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://ssc.nic.in సందర్శించాలి.

-అప్పటికే వివరాలను నమోదు చేసి ఉంటే.. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగ్ అవ్వాలి.

-కొత్తగా వెబ్ సైట్ ను సందర్శించిన వారైతే.. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దాని కోసం అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక చేయండి.

-దీనిలో ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత మొబైల్ , ఈ మెయిల్ ఐడీకి వచ్చిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి.

-నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలను నమోదు చేసి..సబ్ మిట్ చేస్తే.. మీ అప్లికేషన్ విజయవంతంగా సమర్పించినట్లే

-చివరగా అప్లికేషన్ ఫారమ్ ను భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ తీసుకోవాలి.

నోటిఫికేషన్ PDF ను ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Staff Selection Commission

ఉత్తమ కథలు