Home /News /jobs /

STAFF SELECTION COMMISSION INVITES APPLICATIONS FROM 10TH PASSED CANDIDATES TO FILL MULTI TASKING STAFF POSTS KNOW EXAM PATTERN AND SYLLABUS SS

SSC Recruitment 2021: టెన్త్ పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

SSC Recruitment 2021: టెన్త్ పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

SSC Recruitment 2021: టెన్త్ పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

SSC Recruitment 2021 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి.

    టెన్త్ పాసైనవారికి గుడ్ న్యూస్. టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 మార్చి 21 లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌ను నోటిఫికేషన్‌లు వివరించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. రెండు దశల పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది.

    SSC Recruitment 2021: సిలబస్ వివరాలు ఇవే...


    పేపర్ పరీక్షలో 100 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌కు 25 మార్కుల చొప్పున ఉంటాయి. 90 నిమిషాల్లో పేపర్-1 పూర్తిచేయాలి.

    IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 505 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. నాన్ వర్బల్ టైప్ ప్రశ్నలుంటాయి. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్‌మెంట్, డిసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, డిక్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్, ఫిగర్ క్లాసిఫికేషన్, ఆర్థమెటికల్ నెంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్ లాంటి టాపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

    న్యూమరికల్ యాప్టిట్యూడ్‌లో నంబర్ సిస్టమ్స్, కంప్యుటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రేషియో, ప్రాపరేషన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ లాంటి టాపిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

    RBI Recruitment 2021: ఆర్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    BRO Recruitment 2021: బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

    జనరల్ ఇంగ్లీష్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే వొకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, ఆంటోనిమ్స్ లాంటి ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్‌నెస్‌పైనా ప్రశ్నలుంటాయి. ఇందులో కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనమిక్ సీన్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ లాంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.

    పేపర్ 1 క్వాలిఫై అయినవారు పేపర్ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ పరీక్షిస్తారు. షార్ట్ ఎస్సే, లెటర్ రాయాల్సి ఉంటుంది. పేపర్ 2పరీక్షలో షార్ట్ ఎస్సేకు 50 మార్కులుంటాయి. 30 నిమిషాల్లో పేపర్-2 పరీక్ష పూర్తి చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Staff Selection Commission

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు