Home /News /jobs /

STAFF SELECTION COMMISSION INVITATION TO APPLY FOR SSC PHASE 10 SELECTION POSTS LEARN ABOUT THE RECRUITMENT PROCESS GH VB

Staff Selection Commission: ఆ పోస్ట్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భర్తీ చేస్తుంది. తాజాగా సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X- 2022 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి దరఖాస్తు ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభమైంది.

ఇంకా చదవండి ...
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భర్తీ చేస్తుంది. తాజాగా సెలక్షన్ పోస్ట్ ఫేజ్ X- 2022 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను(Applications) ఆహ్వానిస్తోంది. దీనికి దరఖాస్తు ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 13గా నిర్ణయించారు. అలాగే దరఖాస్తు (Application) ఫారంలోని తప్పులను సవరించడం కోసం జూన్(June) 20 నుంచి జూన్ 24 వరకు సమయం కేటాయించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) ఈ పరీక్షను ఆగస్టులో, కంప్యూటర్ మోడ్‌లో నిర్వహిస్తుంది. అయితే అధికారికంగా పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2065 ఖాళీలను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేయనుంది.

* సెలక్షన్ పోస్ట్ ఫేజ్10 - 2022: అర్హత ప్రమాణాలు
సెలక్షన్ పోస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థి దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (హై స్కూల్) పరీక్షను పూర్తి చేసి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* దరఖాస్తు విధానం
స్టెప్-1: సంస్థ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inను సందర్శించాలి.

స్టెప్-2: హోమ్ పేజీలోని ఎస్‌ఎస్‌సీ క్యాండిడేట్స్ పోర్టల్‌లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

స్టెప్-3: ఆ తరువాత ఫేజ్ X 2022 పరీక్ష కోసం లాగిన్ అయి దరఖాస్తు చేసుకోండి.

స్టెప్-4: అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

స్టెప్-5: ఆపై దరఖాస్తు రుసుమును చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.

స్టెప్-6: దరఖాస్తు ఫారమ్ కన్ఫర్‌మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.

Chitrakoot: శ్రీవారి విగ్రహాలు దొంగిలించాక భయానక పీడకలలు.. ఔరంగజేబు కట్టించిన ఏకైక ఆలయం!!

* దరఖాస్తు రుసుము వివరాలు
అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లించవచ్చు. SBI చలాన్‌ రూపంలో SBI బ్రాంచ్‌ల్లో లేదా BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. రిజర్వేషన్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (PwD), మాజీ సైనిక కుటుంబానికి (ESM)కి చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

* సెలక్షన్ పోస్ట్ ఫేజ్10 - 2022: పరీక్షా విధానం
పరీక్ష కంప్యూటర్ మోడ్‌లో జరుగుతుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Staff Selection Commission, Students

తదుపరి వార్తలు