స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL 2021) తుది ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష ఫలితాలను చూడటానికి అభ్యర్థులు అధికారిక సైట్ ssc.nic.inని సందర్శించడం ద్వారా తనిఖీ చేయవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను నియమించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తుల ప్రక్రియ 23 డిసెంబర్ 2021న ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం టైర్ 1 పరీక్ష 11 ఏప్రిల్ నుండి 21 ఏప్రిల్ 2022 వరకు నిర్వహించబడింది. ఆ తర్వాత అభ్యర్థులను జనవరి 15 నుండి జనవరి 31, 2023 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు. ఇప్పుడు ఈ పరీక్ష తుది ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థుల పేరు, రోల్ నంబర్, ర్యాంక్ వివరాలను వెబ్ సైట్ లో పొందవచ్చు.
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఎగ్జామినర్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొదలైన విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
Step 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inకి వెళ్లండి.
Step 2: ఆ తర్వాత అభ్యర్థి హోమ్ పేజీలో ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: అప్పుడు అభ్యర్థి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2021 తుది ఫలితాల ప్రకటన లింక్‌కి వెళ్లాలి.
Step 4: ఆ తర్వాత తదుపరి పేజీలో చెక్ రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 5: అప్పుడు అభ్యర్థి ఫలితం PDF ఫార్మాట్‌లో కనిపిస్తుంది.
Step 6: ఇప్పుడు అభ్యర్థులు తమ పేరు లేదా రోల్ నంబర్‌ని సెర్చ్ చేయడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Step 7: ఫలితాన్ని తనిఖీ చేసిన తర్వాత.. అభ్యర్థులు తమ రిజల్ట్స్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Ssc, Staff Selection Commission