స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL టైర్ 1 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను SSC యొక్క ప్రాంతీయ వెబ్‌సైట్‌లలో విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం అభ్యర్థులు SSC యొక్క అధికారిక వెబ్‌సైట్ చిరునామా ssc.nic.in ను సందర్శించాలి. అయితే.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ టైర్ 2 మార్చి 2 నుండి మార్చి 7, 2023 వరకు నిర్వహించనుండగా.. సీహెచ్ఎస్ఎల్ టైర్ I పరీక్షలు మార్చి 9 నుండి మార్చి 21, 2023 వరకు నిర్వహించబడతాయి. SSC CGL టైర్ II పరీక్షలో పేపర్ వన్, పేపర్ టూ మరియు పేపర్ 3 వేర్వేరు రోజులలో మరియు వేర్వేరు షిఫ్టులలో నిర్వహించబడతాయి.
పేపర్ II అనేది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉంటుంది. ఇది టైర్ 1లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే. టైర్ Iలో పేపర్ IIIకి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే పేపర్ III నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించబడుతుంది.
CHSL టైర్ 1 అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే ssc.nic.in ని సందర్శించండి.
-ఇక్కడ హోమ్‌పేజీలో అడ్మిట్ కార్డ్ అనే ట్యాబ్ ఇవ్వబడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
-ఇలా చేసిన తర్వాత SSC CHSL టైర్ 1 అడ్మిట్ కార్డ్ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో రోల్ నంబర్, పుట్టిన తేదీ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సమర్పించండి.
-ఇలా చేయడం ద్వారా, మీ అడ్మిట్ కార్డ్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. తర్వాత డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10 + 2) లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL 2022) నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 04, 2023తో ముగిసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4500 పోస్టులను భర్తీ చేస్తారు. DEO(Date Entry Operator), CAG పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి సైన్స్ స్ట్రీమ్ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా.. విద్యార్థి 12వ తరగతిలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. SSC CHSL ఎగ్జామ్‌కు అప్లికేషన్ ఫీజు రూ. 100. అయితే మహిళలు, SC, ST, శారీరక వికలాంగులు లేదా మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Ssc, Staff Selection Commission