పోలీస్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఢిల్లీలోని పోలీస్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఈ నియామకాలను చేపడుతోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ విభాగం సబ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో సబ్ ఇన్‌స్పెక్టర్ GD ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 10 నుండి SI పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. SSC సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in సందర్శించడం ద్వారా చేయాలి.
ఢిల్లీ పోలీస్ మరియు CAPF సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 30. మొత్తం పోస్టుల సంఖ్య 4300 ఉండగా.. సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు పురుషులకు 228, స్త్రీలకు 112 కేటాయించారు. 3960 పోస్టులు సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సు సబ్ ఇన్‌స్పెక్టర్(జీడీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు..
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి .
వయో పరిమితి.. కనీస వయస్సు: 20 సంవత్సరాలు.
గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము..Gen/ OBC/ EWS : రూ.100/-SC/ST/EXలు : లేదుఅన్ని కేటగిరీ స్త్రీలు : లేదుఆన్‌లైన్ డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ ఫీజు మోడ్ ద్వారా పరీక్ష రుసుమును చెల్లించాలి.
పోస్టు పేరు | లింగం | మొత్తం |
ఢిల్లీ పోలీసులు | పురుషుడు | 228 |
స్త్రీలు | 112 | |
బీఎస్ఎఫ్ | పురుషుడు | 336 |
స్త్రీలు | 17 | |
సీఐఎస్ఎఫ్(CISF) | పురుషుడు | 77 |
స్త్రీలు | 09 | |
సీఆర్పీఎఫ్(CRPF) | పురుషుడు | 3006 |
స్త్రీలు | 106 | |
ఐటీబీపీ(ITBP) | పురుషుడు | 162 |
స్త్రీలు | 29 | |
ఎస్ఎస్బీ(SSB) | పురుషుడు | 210 |
స్త్రీలు | 08 |
జీతం..
SI GD CAPF-స్థాయి-6కు నెలకు రూ. 35,400 నుంచి 1,12,400 మధ్య ఉంటుంది. SI ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్-లెవల్-6కు నెలకు రూ. 35,400-1,12,400 ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ లో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ , సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణలో వీటికి సంబంధించి పరీక్ష కేంద్రాలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. విజయవాడ , గుంటూరు , కాకినాడ, తిరుపతి , విశాఖ పట్నం రాజమండ్రి, చీరాల, విజయనగరంలో పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కొరకు ఈ https://ssc.nic.in/ వెబ్ సైట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.
SSC CPO SI పరీక్షా సరళి అండ్ సిలబస్ 2022..SSC CPO సబ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వంటి 04 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి విభాగంలో 50 ప్రశ్నలు మరియు 50 మార్కులు ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం 120 నిమిషాలు మాత్రమే ఇవ్వబడుతుంది. SSC CPO సబ్ ఇన్‌స్పెక్టర్ పేపర్ 1ని క్లియర్ చేసిన అభ్యర్థులను తర్వాతి పరీక్షకు అనుమతి ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Police jobs, Ssc, Staff Selection Commission