నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC). ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ (GD) పోస్టులను భారీగా పెంచింది. సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ (CAPF), SSF, ITBP, CRPF, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఖాళీల కోసం ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడటం, నోటిఫికేషన్లు (Job Notifications) రాకపోవడంతో ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఏజ్ లిమిట్‌ను మూడేళ్ల పాటు పెంచుతున్నట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ అక్టోబర్ 27న విడుదల కాగా.. పరీక్షను కూడా నిర్వహించారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24369 ఖాళీ పోస్టులను ఎస్‌ఎస్‌సీ ఇటీవల పేర్కొనగా.. తర్వాత నెల రోజులకు ఈ పోస్టులను పెంచుతున్నట్లు కమిషన్ వెబ్ సైట్లో పేర్కొంది. దాదాపు 25 వేల నుంచి 45,284 వరకు ఈ పోస్టులను పెంచగా.. తాజాగా మరో సారి పోస్టులను పెంచుతూ నోటీస్ విడుదల చేసింది. అంతే కాకుండా.. రాష్ట్రాల వారీగా పోస్టుల ఖాళీలను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆ వివరాలను తెలుసుకోవచ్చు.
-ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా BSFలో మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 10497 పోస్టులు ఉండగా.. తర్వాత 20,765 వరకు పెంచారు. తాజాగా దీనిని 21, 052 వరకు పెంచారు.
-CISFలో మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 100 పోస్టులు ఉండగా.. తర్వాత వీటిని 5914కు పెంచారు. ప్రస్తుతం వీటి సంక్య 6060గా ఉంది.
-CRPFలో 8911 పోస్టులుండగా.. తర్వాత వీటిని 11,169 పోస్టులకు పెంచారు. ప్రస్తుతం 11169గా ఉన్నాయి.
-SSBలో 1284 పోస్టులుండగా.. తర్వాత వీటిని 2168కు పెంచారు. ప్రస్తుతం 2274గా ఉన్నాయి.
-ITBPలో 1613 పోస్టులుండగా.. తర్వాత వీటిని 1787కు పెంచారు. ప్రస్తుతం 5642 గా ఉన్నాయి.
-ARలో 1697 పోస్టులుండగా.. తర్వాత వీటిని 3153కు పెంచారు. ప్రస్తుతం 3601 పోస్టులు ఉన్నాయి.
-SSFలో 103 పోస్టులుండగా.. వీటిని 154కు పెంచారు. తాజా నోటీస్ ప్రకారం వీటవిని 214కు పెంచారు.
-పార్ట్ బీలో ఎస్బీ(NCB)లో మొత్తం పోస్టులు 175 పోస్టులు ఉన్నాయి.
ఇలా మొత్తం పోస్టుల సంఖ్య 45 వేల నుంచి 50,187కు పెంచింది ఎస్సెస్సీ. పూర్తి పీడీఎప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఐదు దశల్లో జరుగుతుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ (DME/ RME), డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ఐదు దశల్లో ఎంపిక చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ చేసిన వారికి NCB సిపాయి పోస్టుకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు జీతం లభిస్తుంది. ఇతర పోస్టులకు రూ. 21,700 నుండి 69,100 మధ్య జీతం లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi police, JOBS, Ssc, Staff Selection Commission