హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Huge Vacancies: అతి భారీ నోటిఫికేషన్.. 24 వేల నుంచి 45 వేలకు పెంచిన కానిస్టేబుల్ పోస్టులు..

Huge Vacancies: అతి భారీ నోటిఫికేషన్.. 24 వేల నుంచి 45 వేలకు పెంచిన కానిస్టేబుల్ పోస్టులు..

Huge Vacancies: అతి భారీ నోటిఫికేషన్.. 24 వేల నుంచి 45 వేలకు పెంచిన కానిస్టేబుల్ పోస్టులు..

Huge Vacancies: అతి భారీ నోటిఫికేషన్.. 24 వేల నుంచి 45 వేలకు పెంచిన కానిస్టేబుల్ పోస్టులు..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC). ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ (GD) పోస్టులను భారీగా పెంచింది. సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ (CAPF), SSF, ITBP, CRPF, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఖాళీల కోసం ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC). ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ (GD) పోస్టులను భారీగా పెంచింది. సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ (CAPF), SSF, ITBP, CRPF, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఖాళీల కోసం ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడటం, నోటిఫికేషన్లు (Job Notifications) రాకపోవడంతో ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఏజ్ లిమిట్‌ను మూడేళ్ల పాటు పెంచుతున్నట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ అక్టోబర్ 27న విడుదలైంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24369 ఖాళీ పోస్టులను ఎస్‌ఎస్‌సీ ఇటీవల పేర్కొనగా.. తాజాగా ఈ పోస్టులను పెంచుతున్నట్లు కమిషన్ వెబ్ సైట్లో పేర్కొంది. మొత్తం 45,284 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

అయితే అభ్యర్థులందరూ తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికులు (ESM) అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఐదు దశల్లో జరుగుతుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ (DME/ RME), డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ఐదు దశల్లో ఎంపిక చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ చేసిన వారికి NCB సిపాయి పోస్టుకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు జీతం లభిస్తుంది. ఇతర పోస్టులకు రూ. 21,700 నుండి 69,100 మధ్య జీతం లభిస్తుంది.

TSPSC 6 Notifications: టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి 6 నోటిఫికేషన్లు.. జనవరి 3 నుంచి పరీక్షలు.. వివరాలిలా..

ఖాళీలు, అర్హత వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా BSFలో మొదటివిడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 10497 పోస్టులు ఉండగా.. వీటిని 20,765గా పెంచారు.  CISFలో మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 100 పోస్టులు ఉండగా.. తాజాగా వీటిని 5914కు పెంచారు, CRPFలో 8911 పోస్టులుండగా.. తాజాగా వీటిని 11,169 పోస్టులకు పెంచారు., SSBలో 1284 పోస్టులుండగా.. తాజాగా వీటిని 2168కు పెంచారు. ITBPలో 1613 పోస్టులుండగా.. తాజాగీ వీటిని 1787కు పెంచారు.

ARలో 1697 పోస్టులుండగా.. తాజాగా వీటిని 3153కు పెంచారు. SSFలో 103 పోస్టుండగా.. వీటిని 154కు పెంచారు.

Telangana Gurukul Notification: భారీగా పెరిగిన గురుకుల పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..

దీంతో పాటు.. మరో 175 పోస్టులను ఎన్సీబీ ద్వారా భర్తీ చేయునున్నారు. ఇలా మొత్తం 45,248 పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2023 జనవరి 1 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2000 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎస్సెస్సీ నుంచి విడుదలైన నోటీస్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

First published:

Tags: JOBS, Police, Ssc, Ssc gd

ఉత్తమ కథలు